ఇల్లు కట్టి చూడు..!
ABN, First Publish Date - 2023-02-27T00:31:49+05:30
పేదలందరికి ఇల్లు కట్టిస్తామని నమ్మబలికిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఆచరణలో పెట్టలేకపోయిందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం నిర్మించకపోయినా చివరికి సొంతంగా డబ్బులు వెచ్చించి ఇల్లు నిర్మిస్తుంటే కనీసం బిల్లులు రాక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అధికారులను ప్రశ్నిస్తే అదిగో.. ఇదిగో అంటున్నారే తప్ప బిల్లులు మా త్రం మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ. 4.65 కోట్ల బిల్లులు పెండింగ్
సకాలంలో అందని ఇసుక, సిమెంట్
అప్పులు చేసి నిర్మాణాలు
కార్యాలయాల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణ
ఇదీ జగనన్న ఇళ్ల దుస్థితి
అనంతపురం, సిటీ, ఫిబ్రవరి 26: పేదలందరికి ఇల్లు కట్టిస్తామని నమ్మబలికిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఆచరణలో పెట్టలేకపోయిందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం నిర్మించకపోయినా చివరికి సొంతంగా డబ్బులు వెచ్చించి ఇల్లు నిర్మిస్తుంటే కనీసం బిల్లులు రాక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అధికారులను ప్రశ్నిస్తే అదిగో.. ఇదిగో అంటున్నారే తప్ప బిల్లులు మా త్రం మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల జాప్యం, అధికారుల నిర్లక్ష్యంతో ఎక్క డిక్కడ ఇళ్ల నిర్మాణాలు పడకేశాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రూ. 4.65 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. చివరికి దిక్కులేక అప్పులు చేసి మరీ ఇల్లు నిర్మించు కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని లబ్ధిదారులు వాపోతు న్నారు.
అమలు కాని నిబంధనలు
నిబంధనలు ప్రకారం ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరికి బేస్‌మెంట్ పూర్తి చేస్తే రూ. 70 వేలు, రూఫ్ వరకు రూ.37,600, ఆర్‌సీ వరకు రూ. 21,200, ఇళ్లు పూర్తైయిన తరువాత రూ. 21,200 అకౌంట్‌కు జమ చేయాల్సి ఉంది. ఈ ప్రకారం దశల వారిగా ఆయా లబ్ధిదారులకు అందిం చాల్సి ఉంది. ఆయితే ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. బిల్లులు కూడా సకాలంలో రాకపోవడంతో అధికారులు కూడా మిన్నుకుం డిపోవాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోవాలం టే అప్పులు చేయాల్సి వస్తోంది.
రూ. 4.65 కోట్ల బిల్లులు పెండింగ్
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా సకాలంలో బిల్లులు మంజూరు చేయడం లేదు. వీటికితోడు నిర్మా ణ సామగ్రి ధరలు అమాంతం పెరగడం లబ్ధిదారులకు మరింత కలవర పెడుతోంది. అధికార లెక్కల ప్రకారం.. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అనంతపురం, గుంతకల్లు, కళ్యాణదుర్గం డివిజన పరిధిలో 2186 లబ్ధిదారులకు రూ. 4.65 కోట్లు బిల్లులు మంజూరు కాకపోవడం వారి పాలిట శాపంగా మారింది.
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ
బిల్లుల బకాయిలు, సిమెంట్, ఇసుక సకాలంలో సరఫరా చేయక పోయినా.. చాలామంది అప్పులు చేసి నిర్మాణాలు చేస్తున్నారు. ఇళ్ల నిర్మా ణాలు 80 శాతం వచ్చినా కూడా 40 శాతం బిల్లులు కూడా రాకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరోకవైపు అధికా రులు మాత్రం సమస్యలతో మాకు సంబంధం లేదు.. ఇళ్ల నిర్మాణాలు చేయాల్సిందేనని ఒత్తిళ్లు చేస్తున్నారని బాధిత లబ్ధిదారులు వాపోతు న్నారు.
ఎన్టీఆర్ ఇళ్ల పరిస్థితీ అంతే...
ఇక గత ప్రభుత్వ హాయాంలో ఎన్టీఆర్ గృహ పథకం కింద నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించిన బిల్లుల పరిస్థితి మరీ దారుణం. వారికి ఏళ్లుగా ఎదురుచూపులు తప్పడం లేదు. అధికారులైతే ఇక బిల్లులు రావనీ చెప్తున్నారు. ప్రభుత్వం ఆయితే కక్ష సాధింపు దిశగా వ్యవహరి స్తోందనే స్పష్టమవుతోంది. గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ గృహ హక్కు పథకం కింద 6149 ఇళ్లు ఈ ప్రభుత్వంలో పూర్తి అయ్యాయి. వీటికి సం బంధించి సుమారు రూ. 40 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
ఒక్క రూపాయి మాత్రమే పడింది..
లక్ష్మీదేవి (పేరుమార్చాం)
మాది అనంతపురం డివిజన పరిధిలోని జిల్లా సరిహద్దు గ్రామం. మాకు 2018లో ఎన్టీఆర్ గృహ పథకం కింద ఇల్లు మంజూరైంది. ఆయితే ఆర్థిక ఇబ్బందులతో పూర్తి కాలేదు. గత రెండున్నరేళ్ల కింద ఇంటి నిర్మాణం పూర్తి చేశాం. బిల్లుల కోసం అధికారులను అడిగితే ఏమీ పట్టించుకోవడం లేదు. జగనన్న ఇళ్లకే దిక్కులేదు. ఎన్టీఆర్ ఇళ్లకు బిల్లులు ఎక్కడ వస్తాయి అని హేళనగా సమాధానం ఇస్తున్నారు. ఇప్పటి వరకు మాకు ఇంటి బిల్లు కింద ఒక రూపాయి మాత్రమే పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు బిల్లులు మంజూరు చేసి న్యాయం చేయాలి.
అన్నింటా నిర్లక్ష్యమే....రామలక్ష్మి (పేరు మార్చాం)
మాది గుంతకల్లు డివిజన పరిధిలో నివసిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం మాకు ఇల్లు మంజూరు చేసింది. కూలీ పనిచేస్తూ జీవిస్తున్నాం. అద్దె ఇంట్లో ఉండి కుటుంబ పోషణ కష్టంగా మారింది. ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయడంతో ఎంతో సంతోషించాం. ఆయితే ఇంటి నిర్మాణం 70శాతం పూర్తి అయ్యింది. ఇప్పటి వరకు ఒక బిల్లు మాత్రమే పడింది. బిల్లులు రాకపోవడంతో పాటు ఇసుక, సిమెంట్ కూడా సకాలంలో సరఫరా చేయడం లేదు.
పట్టించుకోవడం లేదు... రామన్న (పేరు మార్చాం)
మాది కళ్యాణదుర్గం డివిజన పరిధిలో నివసిస్తున్నాం. మాకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయడంతో సుమారు 80శాతం ఇంటి నిర్మాణం పూర్తి చేశాం. బిల్లులు మాత్రం పడటం లేదు. అధికారులను అడిగితే అదిగో.. ఇదిగో అంటున్నారు. బిల్లుల కోసం ప్రతి రోజు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం. ప్రశ్నిస్తే పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
పెండింగ్ వాస్తవమే..
జగనన్న ఇళ్ల నిర్మాణాల పరంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ. 4.65 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్న విషయం వాస్తవమే. ఈ విషయం ఇప్పటికే నివేధించాం. త్వరలోనే పడుతాయి. ఎన్టీఆర్ ఇళ్ల బిల్లుల విష యం కూడా ప్రభుత్వానికి నివేదించాం. లబ్ధిదారులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సిమెంట్, ఇసుక తదితర సామగ్రి సమస్య ఉంటే మా దృష్టికి తీసుకొస్తే పరిష్కారిస్తాం.
- కేశవనాయుడు, హౌసింగ్ ఇనచార్జి పీడీ
Updated Date - 2023-02-27T00:32:02+05:30 IST