ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధానిగా అమరావతినేకొనసాగించాలి

ABN, First Publish Date - 2023-02-02T00:45:34+05:30

రాష్ట్ర రాజధానిగా అమరావతినేకొనసాగించాలని ఏఐఎ్‌సఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం విద్య, ఫిబ్రవరి 1: రాష్ట్ర రాజధానిగా అమరావతినేకొనసాగించాలని ఏఐఎ్‌సఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం ఆ సంఘం నాయకులు అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మోకాళ్లపై నిల్చుని, అర్ధనగ్నంగా ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కుళ్లాయిస్వామి, ప్రధాన కార్యదర్శి చిరంజీవి మాట్లాడుతూ...మాజీ ఎంపీ వివేకా హత్య కేసుపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతుంటే, దాని నుంచి దృష్టి మళ్లించడం కోసం విశాఖను రాజధానిగా కొనసాగిస్తామంటూ కొత్త డ్రామాకు తెర తీశారన్నారు. గత అసెంబ్లీలో అమరావతికి అంగీకారం తెలిపిన జగన ఇప్పుడు మాట మార్చడం విడ్డూరంగా ఉందన్నారు. విశాఖ నుంచి పరిపాలన కొనసాగిస్తామని సీఎం ప్రకటన చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. రాజధాని విషయంలో జగన దుందుడుకు చర్యలకు ఐదు కోట్ల ఆంఽధ్ర రాష్ట్ర ప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారని విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నగర కార్యదర్శి రమణయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి ఉమామహేష్‌, నాయకులు ఆనంద్‌, చిన్న, నారాయణస్వామి, పవన, హరి, మారుతీ, విశ్వ, మురళి, యశ్వంత, సిద్ధు, శశి, కృష్ణ మోహన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T00:45:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising