గూగూడులో అగ్ని గుండం ఏర్పాటు
ABN, First Publish Date - 2023-07-22T00:28:50+05:30
గూగూడు కళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం పీర్ల చావిడి ఎదుట అగ్నిగుండం ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి గ్రామస్థులు గుండంలో మట్టిని బయటకు తీశారు.
నార్పల, జూలై 21: గూగూడు కళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం పీర్ల చావిడి ఎదుట అగ్నిగుండం ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి గ్రామస్థులు గుండంలో మట్టిని బయటకు తీశారు. అనంతరం గుండం చుట్టూ రాళ్లతో గోడ కట్టి.. అగ్గి రాజేశారు. బ్రహ్మోత్సవాలు ముగిసేవరకూ అగ్ని రగులుతూనే ఉంటుంది. హుసేనప్ప, తిరుమల కొండన్న వంశీయులు స్వామివారి 21 పీర్లకు శనివారం ఉదయం బంగారు అభరణాలు, పట్టువస్ర్తాలతో ఆలంకరించి, పీర్ల చావిడిలో కొలువుదీరుస్తారు. వారం రోజులపాటు గూగూడులో కుళ్లాయిస్వామి ఉత్సవమూర్తులను భక్తుల దర్శనానికి అందుబాటులో ఉంచుతారు. దీంతో శనివారం నుంచి గూగూడుకు భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. అనంతపురం, ధర్మవరం, తాడిపత్రి డీపోల నుంచి గూగూడుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నారు.
Updated Date - 2023-07-22T00:28:50+05:30 IST