ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాస్టిక్‌ వాడితే చర్యలు: కమిషనర్‌

ABN, First Publish Date - 2023-03-02T00:13:19+05:30

నగరంలో ప్లాస్టిక్‌ వినియోగించిన వారిపై చర్యలు తప్పవని నగర కమిషనర్‌ భాగ్యలక్ష్మి హెచ్చరించారు. సోమవారం కార్పొరేషన కార్యాల యంలోని మీటింగ్‌ హాల్‌లో ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అనంతపురం క్రైం, మార్చి1: నగరంలో ప్లాస్టిక్‌ వినియోగించిన వారిపై చర్యలు తప్పవని నగర కమిషనర్‌ భాగ్యలక్ష్మి హెచ్చరించారు. సోమవారం కార్పొరేషన కార్యాల యంలోని మీటింగ్‌ హాల్‌లో ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నగర కమిషనర్‌తో పాటు సెక్రటరీ సంగం శ్రీనివాసులు, ఎంహెచఓ గంగాధర్‌రెడ్డి, డీఈ రాంప్రసాద్‌, పర్యావరణ అధికారి శంకర్‌రావు, పంచాయతీ ఈఓఆర్డీలు, పీటీఆర్వో విశ్వజ్యోతి పాల్గొన్నారు. కమిషనర్‌ మాట్లాడుతూ వంద మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే పీవీసీ లేదా ప్లాస్టిక్‌ బ్యానర్లు తదితర వస్తువులు ఇదివరకే నిషేధించినట్లు తెలిపారు. స్వీట్‌బాక్సులు, ఆహ్వానపత్రికలు, సిగరెట్‌ ప్యాకెట్లలో వాడే ప్యాకింగ్‌ ఫిల్ములు, ప్లాస్టిక్‌ స్టిక్స్‌ ఉండే ఇయర్‌బడ్స్‌, బెలూన్లకు వాడే ప్లాస్టిక్‌ స్టిక్స్‌, ప్లాస్టిక్‌ జెండాలు, క్యాండీల స్టిక్స్‌, ఐస్‌క్రీం పుల్లలు, ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, చెంచాలు, కత్తులు, స్ర్టాలు, ట్రేలు, తదితర పరికరాలు నిషేధించినట్లు తెలిపారు. నగరంలోని కూరగాయలు విక్రయించే తోపుడుబండ్లు, పండ్లు, తోపుడుబండ్ల నిర్వాహకులకు నిషేధంపై తెలియజేయాలన్నారు. ప్లాస్టిక్‌ను రోడ్లపై వేయకూడదన్నారు. ప్లాస్టిక్‌ నిషేధంపై ర్యాలీలు నిర్వహించాలన్నారు.

Updated Date - 2023-03-02T00:13:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!