ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సడలని దీక్ష

ABN, First Publish Date - 2023-09-23T00:17:47+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరె్‌స్టపై హిందూపురంలో నిరసనల హోరు కొనసాగుతూనే ఉంది.

ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో రిలే దీక్షలు

హిందూపురం, సెప్టెంబరు 22: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరె్‌స్టపై హిందూపురంలో నిరసనల హోరు కొనసాగుతూనే ఉంది. శుక్రవారం నియోజకవర్గంలోని ఎస్సీసెల్‌ నాయకులు రిలే దీక్షను చేపట్టారు. వారు మాట్లాడుతూ ఉద్యమాలకు ఊపిరిపోసింది దళితులేనని, అలాంటిది మరోసారి అక్రమ అరె్‌స్టను నిరసిస్తూ దళితులు బాబుకోసం దీక్షలు చేపడుతున్నారన్నారు. ఈ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో తమను ఎదుర్కొనలేక పోలీసులను అడ్డుపెట్టి వ్యవస్థలు మ్యానేజ్‌చేసి చంద్రబాబును అరెస్ట్‌ చేసిందన్నారు. ఈ పాపం ఊరికేపోదని వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. టీడీపీ ఎస్సీసెల్‌, దళిత సంఘాల నాయకులు కౌన్సిలర్‌ సతీష్‌, హెచఎన రాము, జయసింహ, బేకరి గంగాధర్‌, ఎస్టీసెల్‌ వెంకటరమణ, రామాంజినమ్మ, బేవనహళ్లి మూర్తి, మోతుకపల్లి ఆనందప్ప, నాగార్జున, మోదాశివ, రామాంజి పాల్గొన్నారు.

Updated Date - 2023-09-23T00:17:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising