కొత్తచెరువులో భవిష్యత్తుకు గ్యారెంటీ
ABN, First Publish Date - 2023-09-04T23:37:12+05:30
కొత్తచెరువు, సెప్టెంబరు 4:: మండల కేంద్రంలోని ఇసుక వంకవీధిలో సోమవారం టీడీపీ నాయకులు భవిష్యత్తుకు గ్యారెంటీ -ఇది బాబు ష్యూరిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి
కొత్తచెరువు, సెప్టెంబరు 4:: మండల కేంద్రంలోని ఇసుక వంకవీధిలో సోమవారం టీడీపీ నాయకులు భవిష్యత్తుకు గ్యారెంటీ -ఇది బాబు ష్యూరిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ తిరుగుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టో పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేపట్టారు. చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాఽధ్యమని, మన పిల్లలకు భవిష్యత్తు లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉండాలంటే చంద్రబాబు సీఎం కావాలని చెప్పారు. ఆయనైతేనే కంపెనీలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ గెలుపునకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సాలక్కగారి శ్రీనివాసులు, ఆడపాల రామకృష్ణ, ఒలిపి శ్రీనివాసులు, బండ్లపల్లిరాజు, సురేశనాయుడు, బూత కన్వీనర్ ఆంజనేయులు, సుబ్బరాయుడు, శ్రీనివాసులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-04T23:37:12+05:30 IST