ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిర్యాదుల స్వీకరణకు టోల్‌ఫ్రీ 1902

ABN, First Publish Date - 2023-05-11T00:30:33+05:30

ప్రజలు తమ సమస్యలను నేరుగా సీఎంఓ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లేందుకు జగనన్నకు చెబుదాం పేరుతో ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబర్‌ 1902 ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ గౌతమి వెల్లడించారు.

విలేకరుల సమావేశంలో కలెక్టర్‌, ఎస్పీ, జేసీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాకు ప్రత్యేకాధికారిగా ఎస్‌ఎస్‌ శ్రీధర్‌ : కలెక్టర్‌ గౌతమి

అనంతపురం టౌన, మే 10: ప్రజలు తమ సమస్యలను నేరుగా సీఎంఓ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లేందుకు జగనన్నకు చెబుదాం పేరుతో ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబర్‌ 1902 ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ గౌతమి వెల్లడించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స హాల్‌లో బుధవారం ఎస్పీ శ్రీనివాసరావు, జేసీ కేతనగార్గ్‌తో కలిసి కలెక్టర్‌ విలేకర్ల సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటికే ప్రజల సమస్యలు పరిష్క రించేందుకు స్పందన నిర్వహిస్తున్నామన్నారు. ఆ స్పందన కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా అమలు చేయాలనే ముఖ్యమంత్రి ప్రత్యేకంగా జగనన్నకు చెబుదాం పథకాన్ని ప్రారంభించారన్నారు. ఇప్పటి వరకు జిల్లా స్పందనలో 26639 ఫిర్యాదులు రాగా 26160 అర్జీలకు పరిష్కారం చూపామన్నారు. వ్యక్తిగత స్థాయిలో ఎదురయ్యే సమస్యలకు మరింత మెరుగైన పరిష్కారాలు చూపాల్సి ఉందన్నారు. అర్హత ఉండి ఇతర ఏ కారణంతో అయిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు అందకపోతే నేరుగా జగనన్నకు చెబుదాం టోల్‌ఫ్రీ నంబర్‌ 1902కు ఫోన చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. జిల్లాలో కూడా ఈ కార్యక్రమం సమర్థంగా అమలు చేసేందుకు మండల, జిల్లా, రాష్ట్ర సచివాలయం, సీఎంఓలో మానిటరింగ్‌ యూనిట్‌లు ఏర్పాటు చేశారన్నారు. ఇందు కోసం ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారిగా ఐఏఎస్‌ ఉద్యాన శాఖ కమిషనర్‌ ఎస్‌ఎస్‌ శ్రీధర్‌ను నియమించారన్నారు. జిల్లా స్థాయిలో జిల్లా టీమ్‌లో జడ్పీ సీఈఓ భాస్కరరెడ్డి, పీఏబీఆర్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాసులు ను నియమించామన్నారు. ఈ టీమ్‌ ద్వారా ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.

Updated Date - 2023-05-11T00:30:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising