ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంట్రాక్టు లెక్చరర్లందరినీ క్రమబద్ధీకరించాలి

ABN, First Publish Date - 2023-06-11T03:18:32+05:30

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ లెక్చరర్లందరినీ క్రమబద్ధీకరించాలని ప్రభుత్వ కాంట్రాక్ట్‌ లెక్చరర్ల జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు డిమాండ్‌

అమరావతి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ లెక్చరర్లందరినీ క్రమబద్ధీకరించాలని ప్రభుత్వ కాంట్రాక్ట్‌ లెక్చరర్ల జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. శనివారం విజయవాడలో సమావేశమైన కాంట్రాక్ట్‌ లెక్చరర్లు ‘జగనన్నకు చెబుదాం కాంట్రాక్ట్‌ లెక్చరర్ల గోడు’ పేరుతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. కేబినెట్‌ సమావేశంలో జూన్‌, 2014 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారిని రెగ్యులరైజ్‌ చేస్తామని ప్రకటించారని, దీంతో వేలాదిమంది కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు అన్యాయం జరిగిందన్నారు. కుమ్మరకుంట సురేశ్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఉన్నతవిద్యా పరిరక్షణ కమిటీ నాయకులు, ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ లెక్చరర్ల సంఘ ప్రతినిధులు కల్లూరి శ్రీనివాస్‌, రత్మకుమారి, ఎల్‌. పద్మారావు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-11T04:37:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising