ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఎగువ భద్ర’తో రాయలసీమకు ముప్పు

ABN, First Publish Date - 2023-02-07T04:03:13+05:30

కర్ణాటక ప్రభుత్వం 2020 నుంచి చేపట్టిన ఎగువ భద్ర ప్రాజెక్టు నిర్మాణం కారణంగా రాయలసీమకు ముప్పు పొంచి ఉందని జాతీయ రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచెం వెంకట సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇక్కడి ప్రజల ఓట్లు అడిగే హక్కు బీజేపీ, వైసీపీకి లేదు: కుంచం వెంకట సుబ్బారెడ్డి

కడప(మారుతీనగర్‌), ఫిబ్రవరి 6: కర్ణాటక ప్రభుత్వం 2020 నుంచి చేపట్టిన ఎగువ భద్ర ప్రాజెక్టు నిర్మాణం కారణంగా రాయలసీమకు ముప్పు పొంచి ఉందని జాతీయ రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచెం వెంకట సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అన్ని రంగాల్లో వెనుకబడిన సీమ ప్రాంతం మరింత వెనుకబడే పరిస్థితులు కల్పిస్తున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిద్రావస్థలో ఉండడం బాధాకరమన్నారు. ఈ మేరకు సోమవారం కడపలో మాట్లాడుతూ.. మొదటి దశలో అప్పర్‌ భద్ర జలాశయం నుంచి మొత్తం 29.50 టీఎంసీల నీటిని 5.56 లక్షల ఎకరాల ఆయకట్టుకు తరలిస్తారని తెలిపారు. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.5,300 కోట్లను కేటాయించిందన్నారు. ఇప్పటికే తుంగభధ్ర జలాశయానికి సరిపడా నీరురా క సీమ జిల్లాల రైతన్నలు కష్టాలపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజా ప్రాజెక్టుతో మూడు ఉమ్మడి జిల్లాల్లోని 7.94 లక్షల ఎకరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. రాయసీమకు అన్యాయం జరుగుతున్న తీరును పట్టించుకోకుండా ఇక్కడి ప్రజల ఓట్ల కోసం బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలు ఆరాటపడడం సరైందికాదన్నారు.

Updated Date - 2023-02-07T04:03:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising