ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఫీజుల దోపిడీపై 5వ విద్యాసంస్థల బంద్‌: ఏబీవీపీ

ABN, First Publish Date - 2023-07-02T02:40:51+05:30

ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ) ఈ నెల 5న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ) ఈ నెల 5న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థల యాజమాన్యాలు సొంత మెటీరియల్‌ పేరిట వేలకు వేలు దోచేస్తున్నా ప్రభుత్వానికి పట్టడంలేదని ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యదర్శి నాగోతు హరి తెలిపారు. టెక్నో, ఈటెక్నో, స్మార్ట్‌, ఒలింపియాడ్‌, ఇంటర్నేషనల్‌ లాంటి బ్రాండ్‌ పేర్లు సృష్టించి అధిక పీజులతో విద్యార్థుల తల్లిదండ్రులను నిలువునా ముంచేస్తున్నారని ధ్వజమెత్తారు. కలెక్టర్‌, డీఈవో, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలతో జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేసి ఫీజులు నియంత్రించాలన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా నడుస్తున్న ప్రైవేటు హాస్టళ్లలో తనిఖీలు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 30వేలకు పైగా ఖాళీ ఉన్న టీచర్‌ పోస్టులను డీఎస్సీ ద్వారా తక్షణమే భర్తీ చేయాలని హరి డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-07-02T02:40:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising