ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వాణిజ్య పన్నుల శాఖలో 2.0 గుబులు

ABN, First Publish Date - 2023-07-11T06:07:27+05:30

వాణిజ్య పన్నుల శాఖలోని ఉద్యోగులను 2.0 భయం వెంటాడుతోంది. ఈ 2.0 ఎవరిని కాపాడుతుందో, ఎవరిని కాటేస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇదిప్పుడు చాపకింద నీరులా తమను చుట్టేస్తుందన్న ఆందోళన ఉద్యోగుల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉద్యోగులకు పునర్‌ వ్యవస్థీకరణ దెబ్బ

జేసీ, సర్కిల్‌ ఆఫీ్‌సలో సిబ్బంది కటాఫ్‌

లెక్కకుమించిన ఉద్యోగులకు బదిలీలు

ఇప్పటికే మొదలైన విద్యా సంవత్సరం

పిల్లలను స్కూళ్లు, కాలేజీల్లో చేర్చామని ఈ దశలో బదిలీలేంటని ఉద్యోగుల ప్రశ్న

(ఆంధ్రజ్యోతి-విజయవాడ)

వాణిజ్య పన్నుల శాఖలోని ఉద్యోగులను 2.0 భయం వెంటాడుతోంది. ఈ 2.0 ఎవరిని కాపాడుతుందో, ఎవరిని కాటేస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇదిప్పుడు చాపకింద నీరులా తమను చుట్టేస్తుందన్న ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న వాణిజ్య పన్నుల శాఖను పునర్‌వ్యవస్థీకరించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనికి 2.0గా పేరు పెట్టారు. గడచిన ఏడాది ఈ శాఖను పునర్‌వ్యవస్థీకరించి కొత్త సర్కిళ్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్లీ పునర్‌వ్యవస్థీకరించడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రక్రియకు సంబంధించి అధికారులు కొన్ని నిబంధనలు రూపొందించారు. ఈ నిబంధనలే ఉద్యోగులను ఆవేదనకు గురి చేస్తున్నాయి.

సిబ్బంది సంఖ్యకు కటాఫ్‌

విజయవాడలో మొత్తం మూడు జాయుంట్‌ కమిషనర్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క కార్యాలయం పరిధిలో ఆరు సర్కిల్‌ కార్యాలయాలున్నాయి. మూడు జేసీ కార్యాలయాల పరిధిలో మొత్తం 18 సర్కిల్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఈ సర్కిల్‌ కార్యాలయాలకు వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని వాటికి ప్రత్యేక కేటగిరీ ఇచ్చారు. మంచి ఆదాయం వచ్చే సర్కిళ్లను ‘హై కేటగిరీ’లో చేర్చారు. ఆదాయం తక్కువగా ఉన్న సర్కిళ్లను ‘లో కేటగిరీ’గా నిర్ణయించారు. మధ్యస్థంగా ఆదాయం వచ్చే సర్కిళ్లను నార్మల్‌గా వ్యవహరిస్తున్నారు. 2.0లో భాగంగా జేసీ కార్యాలయాలతోపాటు సర్కిల్‌ కార్యాలయాలను మార్పు చేయాలని నిర్ణయించారు. విజయవాడలో మూడు జేసీ కార్యాయాలు ఉండగా వాటిలో మొదటిది నోడల్‌గా వ్యవహరిస్తుంది. మిగిలిన రెండు జేసీ కార్యాలయాలు నాన్‌-నోడల్‌ కార్యాలయాలుగా ఉంటాయి. సిబ్బంది బదిలీలు, పదోన్నతులు, సీనియారిటీ జాబితాల రూపకల్పన వంటి కార్యకలాపాలను నోడల్‌ కార్యాలయం నిర్వహిస్తోంది.

సర్దుబాట్లు ఇప్పుడా?

2023-24 విద్యాసంవత్సరం మొదలైంది. పాఠశాలలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. పిల్లలను పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించి ఫీజులు చెల్లించిన తర్వాత సర్దుబాటు అంశం తీసుకురావడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికంగా ఉన్న సిబ్బందిని సర్దుబాటు పేరుతో రాష్ట్రంలో ఎక్కడికైనా బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. విద్యాసంవత్సరం మొదలైన తర్వాత ఈ మార్పులు ఏమిటన్నది ఉద్యోగుల ప్రశ్న. దీనిపై ఉన్నతాధికారులకు ఇప్పటికే విన్నవించారు.

Updated Date - 2023-07-11T06:09:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising