ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP 15 MP seats : టీడీపీకి 15 ఎంపీ సీట్లు!

ABN, First Publish Date - 2023-08-26T03:19:15+05:30

‘ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి 24 లోక్‌సభ స్థానాలు. మిగిలిన ఒక్కటే తెలుగుదేశానికి!’ అంటూ ‘సొంత’, ‘పెయిడ్‌’ సర్వేలతో వరుసగా ఊదరగొట్టిన వైసీపీకి పెద్ద షాక్‌ తగిలింది! వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి 15 ఎంపీ సీట్లు వచ్చే అవకాశముందని ‘ఇండియా

ఒంటరిగానే సాధించే అవకాశం

ఎన్డీయే భాగస్వామ్య పక్షాల్లో ఎవరికీ ఇన్ని వచ్చే చాన్స్‌ లేదు

వైసీపీ 3 - 4 స్థానాలకే పరిమితం

‘ఇండియా టుడే-సీ ఓటర్‌’ సర్వే

ఒక్కసారిగా వైసీపీలో ఉలికిపాటు

ఇన్నాళ్లూ తప్పుడు సర్వేలతో తప్పుదారి

24 సీట్లంటూ సొంత, పెయిడ్‌ సర్వేలు

సొంత నేతలు నమ్మకున్నా హల్‌చల్‌

అమరావతి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి 24 లోక్‌సభ స్థానాలు. మిగిలిన ఒక్కటే తెలుగుదేశానికి!’ అంటూ ‘సొంత’, ‘పెయిడ్‌’ సర్వేలతో వరుసగా ఊదరగొట్టిన వైసీపీకి పెద్ద షాక్‌ తగిలింది! వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి 15 ఎంపీ సీట్లు వచ్చే అవకాశముందని ‘ఇండియా టుడే-సీ ఓటర్‌’ సర్వేలో తేలింది. వైసీపీ 3-4 స్థానాలకే పరిమితమయ్యే అవకాశముందని ఈ సర్వేలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం. మిగిలిన స్థానాల్లో హోరాహోరీ లేదా జనసేన-టీడీపీ పొత్తును బట్టి ఫలితాలు ఉంటాయని భావించవచ్చు. గురువారం రాత్రి పొద్దుపోయాక ‘ఇండియా టుడే’ ఇంగ్లీష్‌ న్యూస్‌ చానల్‌.. ‘సీ ఓటర్‌’తో కలిసి ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ పేరుతో చేసిన సర్వే ఫలితాలను వెల్లడించింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం విషయంలో మోదీ ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉన్నప్పటికీ... తన వ్యక్తిగత కరిజ్మాతో మోదీ పెద్ద ఇబ్బందులు లేకుండా మూడోసారి అధికారంలోకి వచ్చేస్తారని తెలిపింది. 26 పార్టీల ప్రతిపక్ష కూటమి అయిన ఇండియా సంఖ్యాబలం 200 సీట్లకు మించదని ఈ సర్వే అభిప్రాయపడింది. ఇందులో... తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించింది. టీడీపీ ప్రస్తుతం ఎన్డీయేలో లేనప్పటికీ బీజేపీ సన్నిహితమైన పార్టీగానే పేర్కొంది. అంతేకాదు... ఎన్డీయేలో బీజేపీ మినహా మరే పార్టీ కూడా 15 సీట్లు గెలుచుకునే పరిస్థితి లేదని, ‘భాగస్వామి కాని భాగస్వామి’ అయిన టీడీపీకి మాత్రమే ఆ అవకాశం ఉందని వెల్లడించింది.

వైసీపీ గాలి తుస్‌: వైసీపీకి 24 ఎంపీ సీట్లు వస్తాయంటూ ‘టైమ్స్‌ నౌ’ సర్వే పేరిట చేస్తున్న హడావుడిలో అసలు విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ఇప్పటికే బయటపెట్టింది. ‘ఇమేజ్‌ బిల్డప్‌’ పేరుతో జగన్‌ సర్కారు టైమ్స్‌కు రూ.25కోట్ల దాకా చెల్లించింది. ప్రభుత్వం చెల్లించే ‘ప్రకటనల’ డబ్బు దీనికి అదనం. ఇందులో భాగంగానే వైసీపీకి అనుకూల ఫలితాలు వెలువడుతున్నాయన్నది విశ్లేషకుల వాదన. ఇక ‘ఈటీజీ-టైమ్స్‌ నౌ’ పేరుతో వెలువడిన సర్వే మరింత డొల్ల! ఇందులో ‘ఈటీజీ’ ప్రతినిధులకు నేరుగా వైసీపీతో లింకులున్నాయని స్పష్టమైంది. ఐప్యాక్‌ సర్వేల్లో ‘అసలు’ వాస్తవాలు బయటపడుతుండగా... ప్రజలను తప్పుదారి పట్టించేందుకే సొంత, పెయిడ్‌ సర్వేలు చేయించుకుంటున్నట్లు రుజువైంది. వైసీపీకి 24 ఎంపీ స్థానాలొస్తాయంటే ఆ పార్టీ నేతలే నమ్మడంలేదు. జనం దీనినో ‘జోక్‌’గా భావించి నవ్వుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ‘ఇండియా టుడే’ సర్వేలో.. టీడీపీ ఒంటరిగానే 15 లోక్‌సభ స్థానాలు గెలుచుకునే అవకాశముందని వెల్లడి కావడం ఆ పార్టీలో కొత్త జోష్‌ నింపుతోంది. వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

Updated Date - 2023-08-26T03:19:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising