107, 108 జీవోలు తక్షణమే రద్దు చేయాలి: నసీర్ అహ్మద్
ABN, First Publish Date - 2023-07-21T03:21:24+05:30
ఎంబీబీఎస్ సీట్ల అమ్మకం కోసం జారీ చేసిన 107, 108 జీవోలను తక్షణమే రద్దు చేయాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మొహమ్మద్ నసీర్ అహ్మద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అమరావతి, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్ సీట్ల అమ్మకం కోసం జారీ చేసిన 107, 108 జీవోలను తక్షణమే రద్దు చేయాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మొహమ్మద్ నసీర్ అహ్మద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంబీబీఎస్ సీట్లు అమ్ముకోవాలన్న జగన్‌రెడ్డి నిర్ణయం వైద్య రంగానికే కళంకమని విమర్శించారు. 50 శాతం సీట్లను అమ్ముకోవాలన్న నిర్ణయం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమేనని ఆరోపించారు. పేదల పక్షపాతి అని చెప్పుకునే జగన్‌రెడ్డి.. పేద, మధ్య తరగతి విద్యార్థులు లక్షలు పోసి ఎంబీబీఎస్ సీట్లు ఎలా కొంటారని ప్రశ్నించారు.
Updated Date - 2023-07-21T03:21:24+05:30 IST