ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాబుదానా పాపడ్‌

ABN, First Publish Date - 2022-03-05T18:38:32+05:30

సగ్గుబియ్యం - ఒక కప్పు, జీలకర్ర - రెండు టీస్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, నిమ్మరసం - ఒక టీస్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: సగ్గుబియ్యం - ఒక కప్పు, జీలకర్ర - రెండు టీస్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, నిమ్మరసం - ఒక టీస్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌. 


తయారీ విధానం: ముందుగా సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి కొద్దిగా నీళ్లు పోసి రెండు, మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం కాస్త మెత్తగా అయ్యాక నీళ్లు తీసేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నాలుగు కప్పుల నీళ్లు పోసి సగ్గుబియ్యం వేయాలి. కాస్త వేడి అయిన తరువాత జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్టు, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. చిన్నమంటపై ఉడికించుకోవాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. సగ్గుబియ్యం బాగా మెత్తగా అయ్యాక నిమ్మరసం పిండుకుని దింపుకోవాలి. వెడల్పాటి ప్లేట్‌లలో సగ్గుబియ్యం మిశ్రమాన్ని పోసుకోవాలి. వీటిని ఐదారు రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలి. దుమ్ము పడకుండా కాటన్‌ క్లాత్‌ కప్పి ఎండలో ఆరబెట్టుకోవచ్చు. వీటిని జాడీలో భద్రపరచుకుని స్నాక్స్‌గా సర్వ్‌ చేసుకోవచ్చు.

Updated Date - 2022-03-05T18:38:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising