ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెసరపప్పు రసం

ABN, First Publish Date - 2022-04-09T17:12:46+05:30

పెసరపప్పు - ముప్పావుకప్పు, అల్లం - చిన్నముక్క, పచ్చిమిర్చి - మూడు, టొమాటో - ఒకటి, పసుపు - చిటికెడు, నూనె - సరిపడా, ఉప్పు - రుచికి తగినంత, ఆవాలు - టీస్పూన్‌,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: పెసరపప్పు - ముప్పావుకప్పు, అల్లం - చిన్నముక్క, పచ్చిమిర్చి - మూడు, టొమాటో - ఒకటి, పసుపు - చిటికెడు, నూనె - సరిపడా, ఉప్పు - రుచికి తగినంత, ఆవాలు - టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, కరివేపాకు - రెండు రెమ్మలు, కొబ్బరి తురుము - రెండు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర - రెండు టేబుల్‌స్పూన్లు, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్‌, నీళ్లు - తగినన్ని.


తయారీ విధానం: పెసరపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్‌లో తీసుకోవాలి. తరువాత అందులో అల్లం ముక్క, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, పసుపు, ఒక టీస్పూన్‌ నూనె, కొద్దిగా ఉప్పు వేసి, రెండున్నర కప్పుల నీళ్లు పోసి ఒక విజిల్‌ వచ్చే వరకు ఉడికించాలి. స్టవ్‌పై కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఇంగువ, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమం వేసి కలుపుకోవాలి. తరువాత మూడు కప్పుల నీళ్లు పోయాలి. రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. రెండు మూడు నిమిషాలు మరిగించుకున్న తరువాత కొబ్బరితురుము, కొత్తిమీర వేయాలి. నిమ్మరసం పిండుకోవాలి. వేడి వేడి అన్నంలోకి ఈ పెసరపప్పు రసం రుచిగా ఉంటుంది.

Updated Date - 2022-04-09T17:12:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising