ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రై ఫ్రూట్‌ పనీర్‌ పరోటా

ABN, First Publish Date - 2022-01-22T19:55:07+05:30

గోధుమ పిండి - మూడు కప్పులు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, బాదం పలుకులు - అరకప్పు, జీడిపప్పు - అరకప్పు, పనీర్‌ - అరకప్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: గోధుమ పిండి - మూడు కప్పులు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, బాదం పలుకులు - అరకప్పు, జీడిపప్పు - అరకప్పు, పనీర్‌ - అరకప్పు, ఎండుద్రాక్ష - పావుకప్పు, బెల్లం - పావు కప్పు, వాము - ఒక టీస్పూన్‌, యాలకుల పొడి - ఒక టీస్పూన్‌, దాల్చినచెక్క పొడి - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత.


తయారీ విధానం: బాదం, జీడిపప్పు పలుకులను పొడి చేసుకోవాలి. పనీర్‌ను చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఒక బౌల్‌లోకి వాటిని తీసుకుని అందులో ఎండుద్రాక్ష, బెల్లం, వాము, యాలకుల పొడి, దాల్చిన చెక్క పొడి వేసి కలుపుకోవాలి. మరొక బౌల్‌లో రెండు కప్పుల గోధుమపిండి తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి మిశ్రమంలా కలుపుకోవాలి. ఇప్పుడు పరోటాలు చేసుకోవడానికి మిశ్రమాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసుకోవాలి. ఒక్కో భాగాన్ని పొడి పిండిలో అద్దుతూ పరోటా చేసుకోవాలి. దాని మధ్యలో ఒక చెంచా డ్రై ఫ్రూట్‌ పనీర్‌ మిశ్రమాన్ని పెట్టాలి. తరువాత పరోటా చివరలు దగ్గరకు ఒత్తాలి. చపాతీ కర్రతో మళ్లీ పరోటా తయారుచేసుకోవాలి. వీటిని పాన్‌పై నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. వేడి వేడిగా తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి.

Updated Date - 2022-01-22T19:55:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising