ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆనపకాయ - గింజల పులుసు

ABN, First Publish Date - 2022-04-30T17:31:31+05:30

శనగలు - 30గ్రా, చిక్కుళ్లు - 30గ్రా, పెసర్లు - 30గ్రా, బొబ్బర్లు - 30గ్రా, ఆనపకాయ - ఒకటి (చిన్నది), దాల్చిన చెక్క - చిన్నముక్క, టొమాటో - మూడు, సోంపు -

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: శనగలు - 30గ్రా, చిక్కుళ్లు - 30గ్రా, పెసర్లు - 30గ్రా, బొబ్బర్లు - 30గ్రా, ఆనపకాయ - ఒకటి (చిన్నది), దాల్చిన చెక్క - చిన్నముక్క, టొమాటో - మూడు, సోంపు - ఒక టీస్పూన్‌, ఎండు కొబ్బరి - అర ముక్క, ధనియాలు - రెండు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర - అర టేబుల్‌స్పూన్‌, మెంతులు - అర టీస్పూన్‌, నూనె - సరిపడా, ఉప్పు - తగినంత, ఆవాలు - ఒక టీస్పూన్‌, కరివేపాకు - ఒక రెమ్మ, ఎండుమిర్చి - నాలుగైదు, మిరియాలు - కొన్ని.


తయారీ విధానం: ముందురోజు రాత్రి శనగలు, చిక్కుళ్లు నానబెట్టుకోవాలి. ఉదయాన్నే వాటిలో కాస్త ఉప్పు వేసి ఉడికించుకోవాలి.పెసర్లు, బొబ్బర్లను గంట పాటు నానబెట్టి ఉప్పు వేసి ఉడికించాలి.టొమాటోలను, ఆనపకాయను ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి దాల్చిన చెక్క, సోంపు, ధనియాలు, మెంతులు, మిరియాలు, ఎండుమిర్చి, కొబ్బరి వేసి వేయించాలి. ఆ తరువాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.స్టవ్‌పై బాణలి పెట్టి కాస్త నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. కరివేపాకు వేసుకోవాలి. తరువాత టొమాటో ముక్కలు, ఆనపకాయ ముక్కలు వేసి కాసేపు వేయించాలి. బాగా వేగిన తరువాత మిక్సీలో వేసి సిద్ధం చేసుకున్న పొడి వేయాలి. ఉడికించి పెట్టుకున్న గింజలన్నీ వేయాలి. తగినంత ఉప్పు వేసి కలియబెట్టుకోవాలి. కాసేపు ఉడికించుకుని దింపుకోవాలి.

Updated Date - 2022-04-30T17:31:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising