ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు

ABN, First Publish Date - 2022-06-25T09:43:15+05:30

మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ అప్పుల కుప్పగా మార్చారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టీఆర్‌ఎస్‌ ఆఫీసులకు కారు చౌకగా భూములా?: షర్మిల

 

చిలుకూరు, జూన్‌ 24: మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ అప్పుల కుప్పగా మార్చారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. కేసీఆర్‌ కుటుంబం కమీషన్లు దండుకుంటోందని ఆరోపించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 104వ రోజైన శుక్రవారం సూర్యాపేట జిల్లా  చిలుకూరు మండలం బేతవోలులో జరిగిన సభలో ఆమె మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం బంజారాహిల్స్‌లో రూ.110 కోట్ల విలువైన స్థలాన్ని రూ.5 లక్షలకే కేటాయించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. 8 ఏళ్లుగా కేసీఆర్‌ ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తుంటే గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్న చందంగా ప్రతిపక్షాలు నిద్రపోయాయని విమర్శించారు. కాగా, 105వ రోజైన శనివారం పెన్‌పహాడ్‌ మండలంలోని తంగెళ్లగూడెం, చీదెళ్ల, చీదెళ్ల కాలనీ, గాజుల మల్కాపురం, అనిరెడ్డిగూడెం క్రాస్‌రోడ్డు, నుర్జాహన్‌పేట, నేలమర్రి క్రాస్‌ రోడ్డులో షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగుతుంది.

Updated Date - 2022-06-25T09:43:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising