ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగాలు ఇవ్వని సీఎం మనకొద్దు...కేసీఆర్ రాజీనామా చేయాలి: Sharmila

ABN, First Publish Date - 2022-02-15T18:42:17+05:30

ఉద్యోగాలు ఇవ్వని సీఎం మనకొద్దని...వెంటనే కేసీఆర్ రాజీనామా చేయాలని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఉద్యోగాలు ఇవ్వని సీఎం మనకొద్దని...వెంటనే కేసీఆర్ రాజీనామా చేయాలని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు సంఘీభావంగా సాయంత్రం వరకు టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముందు నిరసస దీక్ష చేయనున్నట్లు తెలిపారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం ఖాళీగా ఉన్న లక్ష 90 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయడంతో పాటు, నిరుద్యోగ భృతి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని సీఎం బండకట్టుకొని దేనిలోనైనా దూకితే నిరుద్యోగుల నెత్తిన పాలు పోసినట్లే, దళితున్ని సీఎం చేస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని వైఎస్సార్టీపీ అధినేత్రి వ్యాఖ్యానించారు.


ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్‌లో చలనం లేదని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం కనిపించే కేసీఆర్‌కు రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్య కనిపించదా? అని ప్రశ్నించారు. కొత్త జిల్లాల వారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎష్సీ చైర్మన్ ఉద్యోగాల భర్తీపై ఎలాంటి ఆదేశాలు లేవని చెప్తున్నారంటేనే కేసీఆర్ చిత్తశుద్ధి తెలుస్తోందని వైఎస్ షర్మిల్ విమర్శలు గుప్పించారు.

Updated Date - 2022-02-15T18:42:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising