ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ వస్తే పిరికోడి లెక్క పారిపోయావా?... KCRపై షర్మిల ఫైర్

ABN, First Publish Date - 2022-05-27T17:26:59+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాల పర్యటనపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాల పర్యటనపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘ధాన్యం కొనుగోలుపై ఢిల్లీ కోటలు బద్దలు కొడుతామన్నారు. ప్రధాని మోదీని, బీజేపీని కడిగిపారేస్తాం, ఏకిపారేస్తాం అంటూ గొప్పలు చెప్పారు. స్వయంగా మోదీనే ఇక్కడకు వస్తే మీరెక్కడకు పారిపోయారు కేసీఆర్ గారు. తెలంగాణ ధాన్యం ఎందుకు కొనవు అని నిలదీయలేక పోయారా. మద్దతు ధర ఎందుకు ఇవ్వవు అని ఏకిపారేయలేక పోయావా?. పిల్లిని చూసి ఎలుక దాక్కున్నట్లు మోదీ వస్తే పిరికోడి లెక్క పారిపోయావా?. ఇంటి దాక వచ్చిన ప్రధానిని కలవడానికి మొహం చెల్లదు కానీ.. ఢిల్లీకి పోయి రాజ్యాలు ఏలుతాడట. కేసీఆర్ పాలన అవినీతి మయమని మోదీ చెప్తారు. మోదీ అవినీతి చిట్టా నా దగ్గర ఉందని కేసీఆర్ చెప్తారు. కానీ, ఇద్దరు ఎదురుపడరు, అవినీతిని బయటపెట్టరు’’ అంటూ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated Date - 2022-05-27T17:26:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising