ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PrajaPrasthanam: షర్మిలను అడ్డుకున్న టీఆర్ఎస్ నేతలు

ABN, First Publish Date - 2022-08-11T03:33:54+05:30

జిల్లాలో వైఎస్ షర్మిల (Ys Sharmila) ‘ప్రజా ప్రస్థానం’ (PrajaPrasthanam) పాదయాత్రను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్ (Vikarabad): జిల్లాలో వైఎస్ షర్మిల (Ys Sharmila) ‘ప్రజా ప్రస్థానం’ (PrajaPrasthanam) పాదయాత్రను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దుద్యాల గ్రామంలో ఆమె పాదయాత్ర చేస్తుండగా.. స్థానిక టీఆర్ఎస్ (Trs) శ్రేణులు నిరసనకు. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam narender Reddy)పై  చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి సర్దుమణిగింది. 


కాగా తెలంగాణలో షర్మిల చేపట్టిన  ప్రజా ప్రస్థానం పాదయాత్ర 118వ రోజుకు చేరింది. ఇవాళ ఆమె కొడంగల్‌లో ప్రజలతో ‘మాట ముచ్చట’ కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్లలో దుస్థితిపై మండిపడ్డారు. ప్రభుత్వ స్కూళ్లలో భోజనం సరిగా లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేని భోజనం తిని విద్యార్థులు ఆస్పత్రి పాలవుతున్నారని ధ్వజమెత్తారు. డిగ్రీలు, పీజీలు చదివిన విద్యార్థులు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారని షర్మిల అన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. 




Updated Date - 2022-08-11T03:33:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising