ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌కు షర్మిల షాక్... ఆస్తులపై సీబీఐకు ఫిర్యాదు

ABN, First Publish Date - 2022-10-05T03:10:30+05:30

ఈనెల 6న వైఎస్ షర్మిల (Ys Sharmila) ఢిల్లీ వెళ్లనున్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం (Kcr Government)పై ఆమె సీబీఐ (Cbi), కేంద్ర హోంశాఖ (Central Home Department)కు ఫిర్యాదు చేయనున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ను వైఎస్ షర్మిల టార్గెట్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా వేలకోట్లు సంపాదించారని.. కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని ఆమె పాదయాత్రలో ఇన్నాళ్లు అంటూ వచ్చారు. ఇప్పుడు కేసీఆర్ ఆస్తులపై నేరుగా సీబీఐ, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. డైరెక్ట్‌గా ఢిల్లీ వెళ్లి సీబీఐ అధికారులతో పాటు హోంశాఖ అధికారులనూ ఆమె కలవనున్నారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై దర్యాప్తు జరపాలని కోరనున్నారు. 


ఈ మేరకు షర్మిల 6న (Ys Sharmila) ఢిల్లీ వెళ్లనున్నారు.  అనంతరం సీబీఐ (Cbi), కేంద్ర హోంశాఖ అధికారులను కలుస్తారు. సీఎం కేసీఆర్ ఆస్తులపై ఫిర్యాదు చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ (Kaleswaram Project)లో జరిగిన అవినీతిపైనా విచారణ జరిపించాలని షర్మిల కోరనున్నారు. 


ఇక సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వెళ్తున్న విషయం తెలిసిందే... దసరాకు కొత్త పార్టీని ప్రకటించనున్నారు. మరికొన్ని గంటల్లో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకోనున్నారు.  ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం కానుంది. 


 

Updated Date - 2022-10-05T03:10:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising