ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: యాదగిరిక్షేత్రంలో భక్తుల సందడి

ABN, First Publish Date - 2022-09-05T01:22:35+05:30

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. వేకువజామున సుప్రభాత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. వేకువజామున సుప్రభాత దర్శనంతోనే గర్భాలయంలో కొలువుదీరిన స్వయంభువులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు యాత్రాజనులు కొండపైకి వచ్చారు. ముందుగా కొండకింద లక్ష్మీఫుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కొండపైకి చేరుకుని ధర్మదర్శనాలు..ప్రత్యేక దర్శనాల క్యూలైన్ల గుండా దేవదేవుడి దర్శనాలకు తరలివెళ్లారు. స్వామివారి ధర్మదర్శనాలకు సుమారు 3 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పట్టణ ప్రధానవీధులు, ఆలయ ఘాట్‌రోడ్‌ ప్రాంతాలు వాహనాలతో రద్దీ వాతావరణం నెలకొంది. స్వామికి నిత్య పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతంతో నిత్యారాధనలు ఆరంభించిన ఆచార్యులు రాత్రి వేళ మహానివేదన, శయనోత్సవ వేడుకలతో ఆలయ ద్వారబంధనం గావించారు. వివిధ విభాగాల ద్వారా రూ.32,24,793 ఆదాయం ఆలయ ఖజానాకు సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-09-05T01:22:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising