ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రిలో పార్కింగ్ బాదుడు

ABN, First Publish Date - 2022-05-01T01:20:50+05:30

పునర్నిర్మాణం చేసుకున్న యాదాద్రీశ్వరుడిని దర్శించుకోవాలని భారీ సంఖ్యలో భక్తులు యాదాద్రికి క్యూ కడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: పునర్నిర్మాణం చేసుకున్న యాదాద్రీశ్వరుడిని దర్శించుకోవాలని భారీ సంఖ్యలో భక్తులు యాదాద్రికి క్యూ కడుతున్నారు. ఇప్పట్లో గుట్టపైకి వాహనాలను అనుమతించమని చెబుతూ అధికారులు వాహన దారుల నుంచి పార్కింగ్ ఫీజుల రూపంలో భారీగా బాదుతున్నారు. యాదగిరిగుట్టపై అడ్డగోలుగా పార్కింగ్‌ వసూళ్ల పై ఇక్కడికి వస్తున్న భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొండపై వాహనం పార్క్‌ చేస్తే గంటకు రూ.500 చార్జీ చేస్తున్నారు. గంట దాటితే అదనంగా రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. కొండపైకి వాహనాలను అనుమతించడంతో ఎంతో సంతోషంగా వాహన దారులు తమ వాహనాలతో గుట్టపైకి వస్తున్నారు. తీరా పార్కింగ్‌ పేరిట బాదుడు చూసి కంగుతింటున్నారు.


కాగా కొండపైకి వచ్చే భక్తుల వాహనాలకు దేవస్ధానం ప్రత్యేక చార్జీ నిర్ణయించారు.  కొత్త చార్జీలు ఆదివారం నుంచే అమల్లోకి రానున్నాయి. ఆదివారాలు, సెలవు దినాల్లో భారీ సంఖ్యలో భక్తులు యాదగిరి నరసింహుడిని దర్శించుకునేందుకు వస్తుంటారు. చాలా మంది తమ సొంతవాహనాలపై వస్తుంటారు. అలా వచ్చినవారి నుంచి పార్కింగ్ చార్జీలపేరుతో దోపిడీ చేయడం పై భక్తులు తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2022-05-01T01:20:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising