ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రి క్షేత్రంలో వేడుకగా బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2022-03-11T00:13:40+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడు జగన్మోహినిగా భక్తులకు దర్శనమిచ్చాడు. యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన గురువారం నృసింహుడిని అర్చకులు జగన్మోహినిగా అలంకరించి సేవించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడు జగన్మోహినిగా భక్తులకు దర్శనమిచ్చాడు. యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన గురువారం నృసింహుడిని అర్చకులు జగన్మోహినిగా అలంకరించి సేవించారు. పట్టువస్త్రాలు, బంగారు, వజ్ర, ముత్యాల ఆభరణాలు, పలురకాల పుష్పాలతో ముగ్ధమనోహర శ్రీస్వామి వారి అలంకార మూర్తులకు పారాయణీకులు, పండితులు, అర్చకులు ముందు నడుస్తుండగా బాలాలయ మండపంలో ప్రత్యేక సేవ నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణలు, మూలమంత్ర జపస్తోత్రాలతో మంగళ వాయిద్యాల మధ్య  భక్తులు గోవింద నామస్మరణ చేశారు. స్వామి వారే పరమాత్మ, ప్రజలందరూ జీవాత్మలు అనే భగవద్గీతలోని సారానికి అనుగుణంగా జగన్మోహిని అలంకారంలో బ్రహ్మోత్సవ సేవను ఆలయ ప్రధానార్చకులు నల్లంతీగల్‌ లక్ష్మీనరసింహచార్యులు, మరింగంటి మోహనాచార్యులు ఆధ్వర్యంలో ఈ వైదిక కైంకర్యాలను నిర్వహించారు. 

Updated Date - 2022-03-11T00:13:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising