జనరిక్ మెడిసినే రాయండి!
ABN, First Publish Date - 2022-03-05T06:28:10+05:30
ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మందుల చీటీ (ప్రిస్ర్కిప్షన్)పై
- డిశ్చార్జ్ సమయంలో మందుల చీటీతో సరిపెట్టొద్దు
- డిస్పెన్సరీల్లోంచి రోగులకు సరిపడా మందులివ్వండి
- ప్రభుత్వ వైద్యులకు ఆదేశాలు జారీ చేసిన సర్కారు
- ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేటు మెడికల్ షాప్లొద్దు: హరీశ్
హైదరాబాద్, మార్చి 4 (ఆంఽధ్రజ్యోతి) ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మందుల చీటీ (ప్రిస్ర్కిప్షన్)పై జనరిక్ మెడిసినే రాయాలని అక్కడి వైద్యులను ప్రభు త్వం ఆదేశించింది. ఇటీవల వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ఆ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ప్రభు త్వ ఆస్పత్రుల్లో వైద్యులు ఆయా కంపెనీల బ్రాండ్ పేర్లతోనే మెడిసిన్ రాస్తున్నారు. ఇది జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు విరుద్ధం. వైద్యవృత్తిలో ఉన్నవారంతా కచ్చితంగా జనరిక్ పేర్లతోనే మం దులు రాయాలని ఎన్ఎంసీ నిబంధనలు చెబుతున్నాయి.
ఈ మేరకు ఎన్ఎంసీ ఇప్పటికే ఒక సర్క్యులర్ కూడా జారీ చేసినా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులెవరూ పాటించడం లేదు. తెలంగాణ రాష్ట్ర మె డికల్ కౌన్సిల్ కూడా ఈ ఏడాది జనవరి 11న ప్రభు త్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఓ లేఖ కూడా రాసింది. వైద్యులు విధిగా జనరిక్ మెడిసిన్ పేర్లనే రాయాలని అందులో సూచించింది. అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సర్కారు ప్రభుత్వ వైద్యులు రోగులకు ప్రిస్కిృప్షన్ను జనరిక్ పేర్లతోనే రాయాలని ఆదేశించింది. కాగా ప్రస్తు తం సర్కారీ దవాఖానల్లో ఇన్ పేషంట్స్‌కు మాత్రమే మెడిసిన్ ఇస్తున్నారు. వారు డిశ్చార్జ్ అయ్యే సమయం లో ప్రిస్ర్కిప్షన్ రాస్తున్నారు.
వైద్యుడు రాసే మందులు రోగులు బయటే తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఔషధాల కోసం ఏటా రూ.300-400 కోట్లు ఖర్చు పెడుతోంది. ఇంత పెద్దమొత్తంలో ఖర్చు చేసినప్పటికీ, రోగులకు డిశ్చార్జ్ సమయంలో మందులివ్వడం లేదు. దీనిపై కూడా మంత్రి రివ్యూ చేశారు. ఇక నుంచి రోగులు డిశ్చార్జ్ అయ్యే సమయంలో డాక్టర్ ఎన్నిరోజులకు మందులు రాస్తే... అన్ని మెడిసిన్స్ డిస్పెన్సరీలోనే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ డిస్పెన్సరీల్లో మందుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని టీఎ్సఎంఎ్సఐడీసీని ఆదేశించారు.
మరోవైపు.. ప్రభుత్వ డాక్టర్లు బ్రాండ్ పేర్లతో ప్రిస్కిృప్షన్ రాస్తున్నారు. ఫార్మసీలో అవి ఉండట్లేదు. దాంతో రోగులు ప్రభుత్వ ఆస్పత్రుల ప్రాంగణంలో ఉండే ప్రైవేటు మెడికల్ షాపులకు వెళ్లి కొంటున్నారు. ఇదో పెద్ద కోట్లాది రూపాయల వ్యాపారంగా మారింది. వైద్యులు, మెడికల్ షాపులు కుమ్మక్కు కావడంతో ఈ పరిస్థితి నెలకొందన్న భావనలో సర్కారు ఉంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రభుత్వ ఆస్పత్రుల ప్రాంగణంలో ప్రైవేటు మెడికల్ షాపులు వెలిశాయి. ఆస్పత్రుల సూపరింటెండెంట్ల సహకారంతో ఇవి ఏర్పాటయ్యాయి. మెడికల్ షాపులు, ఆస్పత్రి సూపరింటిండెంట్ల మధ్య మనీ సమన్వయంతో ఇవి నడుస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. అందుకే కాలపరిమితి ముగిసినా సూపరింటెండెంట్లు వాటిని తొలగించడం లేదు.
కొన్నిచోట్ల వారే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవాలని ప్రైౖవేటు మెడికల్ షాపుల యాజమాన్యాలకు సూచిస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వ దృష్టికి వచ్చింది. అందుకే వాటిని తొలగించాలని నిర్ణయించింది. అసలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేటు మెడికల్ షాపులు ఉండటంపై వైద్య మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వాటి కాలపరిమితి ముగియగానే తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, నిమ్స్, సరోజినిదేవీ కంటి ఆస్పత్రి లాంటి వాటిలో ప్రైవేటు మెడికల్ షాపుల యాజమాన్యాలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. సంవత్సరాలపాటు కోర్టు ఆర్డర్ చూపి అలాగే నడిపిస్తున్నాయి. వీటిపై మంత్రి సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించి, స్టే ఎత్తివేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో.. నేటి నుంచి ‘హెల్త్ ప్రొఫైల్’
ప్రారంభించనున్న మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు
సిరిసిల్ల, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్య సమాచారాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేసి, డిజిటల్ కార్డులు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన ‘హెల్త్ ప్రొఫైల్’ కార్యక్రమం ఎట్టకేలకు కార్యరూపం దాల్చబోతోంది. దీన్ని శనివారం రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో పూర్తిస్థాయిలో ప్రారంభించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆస్పత్రిలో పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ములుగు జిల్లా కేంద్రంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.
ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 220, ములుగు జిల్లాలో 153 బృందాలు ఇంటింటి సర్వే చేపట్టనున్నాయి. ప్రతి బృందంలో ఒక ఏఎన్ఎం, ఇద్దరు ఆశావర్కర్లతో పాటు రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది ఉంటారు. ఈ బృందాలను ఆయా మండలాల వైద్యాధికారులు పర్యవేక్షిస్తారు. బుధ, శని, ఆదివారాల్లో నమూనాల సేకరణకు మినహాయింపు ఉంటుంది. మూడు నెలల్లో ఈ రెండు జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ పూర్తి చేయనున్నారు.
Updated Date - 2022-03-05T06:28:10+05:30 IST