ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీడపీడల బెడద.. దిగుబడిపై బెంగ!

ABN, First Publish Date - 2022-09-26T08:34:26+05:30

అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు, ఉన్నట్లుండి వాతావరణంలో వస్తున్న మార్పులు, సీజనల్‌గా వచ్చే సమస్యలతో ప్రధాన పంటలు చీడపీడల బారినపడుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వరి, పత్తి, కంది, మొక్కజొన్నలకు చీడపీడలు.. 
  • అన్నదాతల్లో ఆందోళన..
  • అస్థిర వర్షాలు, వాతావరణ పరిస్థితులతోనే
  • రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువ  

హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు, ఉన్నట్లుండి వాతావరణంలో వస్తున్న మార్పులు, సీజనల్‌గా వచ్చే సమస్యలతో ప్రధాన పంటలు చీడపీడల బారినపడుతున్నాయి. వరి పంట పిలకలు వేసే దశలో, చిరుపొట్ట దశలో, మొక్కజొన్న కంకి వేసే దశలో, పత్తి.. పూత, కాత దశలో ఉన్న సమయంలో చీడపీడలు దాడిచేస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆరు జిల్లాల్లో చీడ పీడల ప్రభావం ఎక్కువగా ఉంది. జూలైలో 121 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. అధిక వర్షాల తాకిడికి సుమారు 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆగస్టులో సాధారణం కన్నా 15శాతం తక్కువ వర్షపాతం నమోదైతే, సెప్టెంబరులో సాధారణం కన్నా 89శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట మినహా మిగిలిన 30 జిల్లాల్లో అధిక వర్ష పాతం నమోదైంది. ఇలా కొన్ని రోజులు అధిక వర్షాలు, మరికొన్ని రోజులు వర్షాభావ పరిస్థితులతో పంటల ఎదుగుదలపై దెబ్బ పడింది.


 ఈ వానాకాలంలో వరి పంట రికార్డుస్థాయిలో 64.32 లక్షల ఎకరాల్లో సాగైంది. కాస్త ఆలస్యంగా వరి నాట్లు వేసిన చోట్ల మినహా రాష్ట్రమంతటా పిలకలు వేసే దశ, చిరు పొట్టదశ, ఈనేదశలో వరి పైరు ఉంది. కాండం తొలిచే పురుగు, రసంపీల్చే పురుగులు వరి పంటపై దాడి చేస్తున్నాయి. వరంగల్‌, సూర్యాపేట, వికారాబాద్‌, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంది. కాండం తొలిపే పురుగు దెబ్బకు తెల్లకంకి ఎక్కువ అవుతోంది. రసంపీల్చే పురుగు దెబ్బకు దోమ ఎక్కువగా వస్తోందని, వరి మొగి పాడవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్న 6.21 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇప్పుడు కంకిదశలో ఉంది. కాండంతొలిచే పురుగు, కత్తెర పురుగు ప్రభావం వికారాబాద్‌, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈసారి రైతులు 5.62 లక్షల ఎకరాల్లో కంది వేశారు. పూత దశలో ఉన్న కందిచేను పెరగకుండా దోమలు ప్రభావం చూపిస్తున్నాయి.  


ఆసిఫాబాద్‌, వికారాబాద్‌ జిల్లాల్లో కందిచేలలో చీడపీడలు ఆశిస్తున్నాయి. పత్తి 49.98 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తిపై నాలుగైదు రకాల చీడపీడలు దాడి చేస్తున్నాయి. సూర్యాపేట, వికారాబాద్‌, వరంగల్‌, రంగారెడ్డి, భువనగిరి, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో రసంపీల్చే పురుగులు, ఆకు మచ్చ తెగులు, ఆకు ఎరుపు తెగులు, పొగాకు వెర్రి తెగులు, రకరకాల దోమలు పత్తి పంటను దెబ్బకొడుతున్నాయి. తొలుత ఆకులపై మచ్చలు ఏర్పడి అవి పెద్దగా మారుతున్నాయి. తర్వాత ఆకు ఎండిపోతోంది. ఇది ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తి చెందుతోంది. వర్షాల బెడదతో ఆకులపై రకరకాల మచ్చలు ఏర్పడుతున్నాయి. రసంపీల్చే పురుగులు కాయలను పీల్చేస్తున్నాయి. పొగాకు వెర్రి తెగులు ప్రభావంతో చిన్న ఆకులు ముడుచుకు పోతున్నట్లు రైతులు, శాస్త్రవేత్తలు గుర్తించారు.

Updated Date - 2022-09-26T08:34:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising