ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలూ... సమస్యలుంటే 9490555533కు వాట్సాప్‌ చేయండి

ABN, First Publish Date - 2022-03-05T06:41:37+05:30

ఆపదలో ఉన్న మహిళలకు సహాయం అందించేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్‌ 


హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఆపదలో ఉన్న మహిళలకు సహాయం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ వాట్సాప్‌ నెంబరును అందుబాటులోకి తెచ్చింది. 24/7 ఎవరికి ఏ విధమైన సహాయం కావాలన్నా 9490555533 నెంబరుకు ఒక్కసారి వాట్సా్‌పలో సందేశం పంపితే చాలు మహిళా కమిషన్‌ అధికారులు బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంటారు. గృహహింస సహా ఇతర సమస్యలను బాధితులు తమకు వచ్చిన భాషలో టెక్ట్స్‌, వాయిస్‌ రూపంలో వాట్సాప్‌ నెంబరుకు తమ పంపించవచ్చు. దీనిపై మహిళలతోపాటు విద్యార్ధినులకు అవగాహన కల్పించేందుకు అన్ని కళాశాలల వద్ద వాల్‌ పోస్టర్లు అంటించనున్నారు.


అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,  మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి దీన్ని ఆవిష్కరించారు.   ఈ సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో భ్రూణ హత్యలు తగ్గాయని, సమాజంలో వస్తున్న మార్పునకు ఇది సంకేతమని అన్నారు. ఆడ, మగ పిల్లల నిష్పత్తిలోనూ చాలా తేడా ఉండేదని, ఆ పరిస్థితి కూడా మారిందని చెప్పారు. మహిళా దినోత్సవాన్ని ఒక్కరోజు జరుపుకొంటే సరిపోదని భావించిన ప్రభుత్వం మూడు రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు.  మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను అందిపుచ్చుకొని ఎదగాలని కోరారు. 


ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి ప్రసంగిస్తూ తమకు వచ్చే ఫిర్యాదుల్లో 75ు గృహహింసకు సంబంధించినవే ఉంటున్నాయని, ఈ పరిస్థితి మారాల్సి ఉందని అన్నారు. మహిళ తోటి మహిళకు శత్రువు కాదని, కానీ కొన్ని సినిమాలు, సీరియళ్లల్లో మహిళల్ని విలన్లుగా చూపిస్తున్నారని చెప్పారు. అది సరైంది కాదని అన్నారు. ప్రేక్షకులు వాటి నుంచి మంచి మాత్రమే తీసుకోవాలని సూచించారు. 8 రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారిని ఈ సందర్భంగా మంత్రులు సన్మానించారు. మహిళ కమిషన్‌ సభ్యురాళ్లు హషీన్‌ అఫ్రోజ్‌, కుమ్రా ఈశ్వరీ భాయి, కొమ్ము ఉమాదేవి, గద్దల పద్మ, సుదాం లక్ష్మి, కటారి రేవతితోపాటు మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌, వీ హబ్‌ సీఈవో దీప్తి రావుల పాల్గొన్నారు.


కాగా, టీఆర్‌ఎ్‌సఎల్‌పీ కార్యాలయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మహిళల భద్రత, అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్దపీట వేశారని చెప్పారు. మహిళల కోసం ప్రత్యేకంగా నాలుగు పారిశ్రామికవాడలను ఏర్పాటు చేశారని చెప్పారు.  ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ మహిళా సంక్షేమ పథకాలను వివరించారు. 


Updated Date - 2022-03-05T06:41:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising