ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్తు డిమాండ్‌కు రెక్కలు

ABN, First Publish Date - 2022-03-05T06:55:32+05:30

విద్యుత్తు డిమాండ్‌కు రెక్కలు వచ్చాయి. రబీలో వినియోగం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  •  రోజుకు 13,539 మెగావాట్లకు చేరిక


హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి):  విద్యుత్తు డిమాండ్‌కు రెక్కలు వచ్చాయి. రబీలో వినియోగం పెరగడం, ఉష్ణోగ్రతల పెరుగుదలతో గృహ వినియోగం పెరగడం, రాష్ట్రవ్యాప్తంగా ఎత్తిపోతల పథకాల్లో ఐదు చోట్ల 450 సామర్థ్యం కలిగిన ఏడు పంపులు నడుస్తుండటంతో విద్యుత్తుకు డిమాండ్‌ పెరుగుతూపోతోంది.  శుక్రవారం ఉదయం 7:50 గంటల సమయంలో 13,539 మెగావాట్లుగా డిమాండ్‌ రికార్డయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధికం.


అదే సమయంలో దక్షిణ డిస్కమ్‌(హైదరాబాద్‌)లో 8,226 మెగావాట్లు, ఉత్తర డిస్కమ్‌(వరంగల్‌)లో 5,046 మెగావాట్ల డిమాండ్‌ రికార్డయింది. గతేడాది ఇదే సమయం కన్నా ఈ డిమాండ్‌ అత్యధికం. వారం రోజులుగా రాష్ట్ర డిమాండ్‌ 13 వేల మెగావాట్లకు అటూఇటుగా ఉంటోంది. ఫిబ్రవరి 25న 13,178 మెగావాట్లు ఉండగా, 26న 13,037, 28న 13,094, ఈనెల 1న 13,354, 2న 12,960, 3న 13,249  మెగావాట్లు నమోదయింది. రానున్న రెండు, మూడు వారాల్లో డిమాండ్‌ 14 వేల మెగావాట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 


టారిఫ్‌ సబ్సిడీ రూ.874 కోట్లు విడుదల

వివిధ వర్గాలకు ఉచితంగా రాయితీతో విద్యుత్తును అందిస్తున్నందుకు  డిస్కమ్‌లకు ప్రభుత్వం రూ.874 కోట్ల టారిఫ్‌ సబ్సిడీ విడుదల చేసింది. ప్రతినెలా ముందస్తుగా సబ్సిడీ విడుదల చేస్తున్న విషయం విదితమే. దాంతో మార్చి మాసానికి  రూ.874.55 కోట్లను విడుదల చేస్తూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ శుక్రవారం జీవో జారీ చేశారు. 26 లక్షల వరకు ఉన్న వ్యవసాయ కనెక్షన్లు, మిషన్‌ భగీరథ, హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ బోర్డు,  ఎత్తిపోతల పథకాల పంపుల విద్యుత్తు బిల్లుల కోసం ఈ నిధులు ఇచ్చారు. 


Updated Date - 2022-03-05T06:55:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising