ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘డబుల్‌’ ఇల్లు ఇస్తారా? చావమంటారా?

ABN, First Publish Date - 2022-08-20T09:39:27+05:30

డబుల్‌ బెడ్‌ రూం ఇంటిని కేటాయించాలని కోరుతూ ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మహత్యకు యత్నించిన ఓ కుటుంబం

వర్ని, ఆగస్టు 19: డబుల్‌ బెడ్‌ రూం ఇంటిని కేటాయించాలని కోరుతూ ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం పాత వర్ని గ్రామానికి చెందిన గూని సంతోష్‌ కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. మూడేళ్ల క్రితం సంతోష్‌ డబుల్‌ బెడ్‌రూం ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటి వరకూ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో మనస్తాపం చెందిన సంతోష్‌.. శుక్రవారం తన భార్య శైలజ, తల్లి భాగవ్వతో కలిసి గ్రామ శివారులో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల వద్ద ఆందోళనకు దిగారు. పెట్రోల్‌ , పురుగుల మందు డబ్బాలతో ఓ ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. తనకు ఇల్లు కేటాయించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని అధికారులకు ఫోన్‌లో సమాచారం అందించారు. దీంతో ఆర్‌ఐ రాజేష్‌, పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని.. సంతో్‌షకు నచ్చజెప్పారు. వీలైనంత త్వరలోనే ఇంటిని కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో.. సంతోష్‌ కుటుంబం ఆందోళన విరమించింది. 

Updated Date - 2022-08-20T09:39:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising