ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగదు బదిలీ డబ్బులను ఎందుకివ్వరు

ABN, First Publish Date - 2022-11-12T03:55:29+05:30

రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పెంపకం పథకం కింద తమ ఖాతాలో వేసిన నగదును ఎందుకివ్వరంటూ లబ్ధిదారులు బ్యాంక్‌ మేనేజర్‌ను నిలదీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్యాంక్‌ మేనేజర్‌ను నిలదీసిన గొర్రెల పథకం లబ్ధిదారులు

మర్రిగూడ, నవంబరు 11: రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పెంపకం పథకం కింద తమ ఖాతాలో వేసిన నగదును ఎందుకివ్వరంటూ లబ్ధిదారులు బ్యాంక్‌ మేనేజర్‌ను నిలదీశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలోని గొర్రెల పెంపకందారుల ఖాతాలకు ప్రభుత్వం నగదును బదిలీ చేసింది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో డబ్బులను ఫ్రీజ్‌ చేశారు. అయితే ఎన్నిక ఫలితం వచ్చి కోడ్‌ ముగిసినా ఎందుకు డబ్బులు తీసుకోనివ్వడం లేదంటూ మర్రిగూడ మండలంలోని శివన్నగూడ యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ నర్సింహారెడ్డిని ఐదుగురు లబ్ధిదారులు శుక్రవారం నిలదీశారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకూ లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన నగదును ఇవ్వొద్దని ఎంపీడీవో ఆదేశాలు జారీ చేశారని బ్యాంక్‌ మేనేజర్‌ తెలిపారు.

Updated Date - 2022-11-12T03:55:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising