ఎందుకలా జరుగుతోంది!
ABN, First Publish Date - 2022-12-16T00:44:58+05:30
సెల్‌పోన్ దొంగతనాలు, మిస్సింగ్ ఫిర్యాదులపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుల స్వీకరణ తీరుపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. సెల్ ఫోన్ పోయిందని బాధితులు ఫిర్యాదు
‘సెల్‌ఫోన్ పోయిందా... మీ-సేవలో చలాన్ కట్టండి’ కథనంపై ఉన్నతాధికారుల ఆరా
హైదరాబాద్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): సెల్‌పోన్ దొంగతనాలు, మిస్సింగ్ ఫిర్యాదులపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుల స్వీకరణ తీరుపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. సెల్ ఫోన్ పోయిందని బాధితులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే... మీ సేవకు వెళ్లాలని పంపుతున్న ఘటనలపై ‘ఆంధ్రజ్యోతి’ లో గురువారం ‘సెల్ ఫోన్ పోయిందా... మీ సేవలో చలాన్ కట్టండి’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టి సారించారు. ఇటీవల కాలంలో సెల్‌ఫోన్ మిస్సింగ్ ఫిర్యాదులపై వివరాలు సేకరించే పనిలో పడ్డారు.
Updated Date - 2022-12-16T00:44:59+05:30 IST