ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యాసినో వ్యాపారం చేశా తప్పేముంది?

ABN, First Publish Date - 2022-08-06T08:58:47+05:30

క్యాసినో వ్యాపారం చేశా తప్పేముంది?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చీకోటి ప్రవీణ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): నేపాల్‌, గోవాల్లో క్యాసినోలు చట్టవ్యతిరేకం కాదని, అక్కడ తాను ఆ వ్యాపారం చేయడంలో తప్పేముందని చీకోటి ప్రవీణ్‌ ప్రశ్నించారు. క్యాసినో వ్యాపారం చేయడం లేదని తాను ఎప్పుడు చెప్పలేదని విలేకరుల వద్ద స్పష్టం చేశారు. శుక్రవారం, నాలుగో రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు హాజరైన చీకోటి ప్రవీణ్‌ను అధికారులు సుమారు గంటన్నర పాటు ప్రశ్నించారు. ఈ విచారణ అనంతరం విలేకరులతో మాట్లాడిన చీకోటి ప్రవీణ్‌.. ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని తెలిపారు. హైదరాబాద్‌లో పుట్టిపెరగడం వల్లే తనకు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కాగా, సోషల్‌ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లని విడిచిపెట్టనని పేర్కొన్నారు. తన పేరుతో సోషల్‌ మీడియాలో నకిలీ ఖాతాలు తెరిచారని, ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. అంతేకాక, తనకు ప్రాణహాని ఉండటంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించానని తెలిపారు. క్యాసినో కేసులో ఈడీ విచారణ ముగిసిన తర్వాత మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడతానని చీకోటి చెప్పారు. 

Updated Date - 2022-08-06T08:58:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising