ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఏవి?: రేవంత్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-02-17T22:53:28+05:30

తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఏవి? అని టీపీసీసీ అధ్యక్షడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఏవి? అని టీపీసీసీ అధ్యక్షడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లక్షా 90 వేల ఖాళీలున్నా భర్తీ చేయడం లేదని తప్పుబట్టారు. ప్రభుత్వ తీరుతో నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర సంపదను సీఎం కేసీఆర్ కొల్లగొట్టారని దుయ్యబట్టారు. ఓయూ విద్యార్థులు నిరుద్యోగ దినోత్సవం చేస్తే.. టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని తెలిపారు. డీజీపీ ఫోన్ ఎత్తడం లేదని, ఇంత బలుపు ఎందుకు? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 


‘‘మేం తలుచుకుంటే మీరు రోడ్లపై తిరగలేరు. దరిద్రుడు సీఎం కావడం వల్లే నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యువత ఆత్మహత్యలు చేసుకుంటుంటే మూడ్రోజుల వేడుకలు అవసరమా? ఎవరైనా చనిపోతే సంతాప దినాలు చేస్తారు. పుట్టినరోజుకు కాదు. కేసీఆర్‌ను రోడ్డు మీదకు లాగే వరకు విశ్రమించబోం. ఎంతమంది పోలీసులను పెట్టినా నిరసన తెలిపి తీరుతాం’’ అని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.


Updated Date - 2022-02-17T22:53:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising