ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ అమ్మ ఫొటోను పోర్న్‌ సైట్లలో పెడతాం

ABN, First Publish Date - 2022-05-23T08:49:23+05:30

‘‘నువ్వు తీసుకున్న అప్పు ఇంకా తీరలేదు. ఇంకా చెల్లించాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • దా‘రుణదా‘రుణ’ యాప్‌ నిర్వాహకుల బెదిరింపులు.. 
  • అప్పు తీర్చినా.. ఇంకా చెల్లించాలంటూ హుకుం


ఖమ్మం, మే 22 (ఆంధ్రజ్యోతి): ‘‘నువ్వు తీసుకున్న అప్పు ఇంకా తీరలేదు. ఇంకా చెల్లించాలి. లేకపోతే.. మీ అమ్మ ఫొటోను మార్ఫింగ్‌ చేసి.. పోర్న్‌ సైట్లలో అప్‌లోడ్‌ చేస్తాం’’ అంటూ ఓ ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌ నిర్వాహకులు ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన ప్రదీప్‌ అనే యువకుడిని బెదిరించారు. అంతేకాదు.. బాధితుడి కాంటాక్ట్‌ లిస్టులో ఉన్న మొబైల్‌ నంబర్లకు సదరు యువకుడు ఓ మోసగాడు అని పేర్కొంటూ సందేశాలు పంపారు. దీంతో బాధితుడు మధిర వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో తాను ఓ లోన్‌యా్‌ప ద్వారా రూ. 5 వేల రుణం తీసుకున్నట్లు.. గడువు(వారం)లోగా తిరిగి చెల్లించినట్లు బాధితుడు ప్రదీప్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ‘‘ఆ తర్వాత రూ. 3,500 చొప్పున రెండు సార్లు లోన్‌ తీసుకున్నా. గడువులోగా తిరిగి చెల్లించేందుకు ప్రయత్నిస్తే.. యాప్‌/వెబ్‌సైట్‌ పనిచేయలేదు. దీంతో.. నిర్వాహకులకు ఫోన్‌ చేస్తే.. యూపీఐ ద్వారా పేమెంట్‌ చేయాలంటూ లింకులు పంపారు. వారు పంపిన యూపీఐ ఖాతాకు ఆ మొత్తం చెల్లించా’’ అని బాధితుడు వివరించారు. ఆ తర్వాత రుణ బకాయి ఇంకా ఉందంటూ వేధింపులు ప్రారంభించారని వాపోయారు. రుణం తీసుకునే ముందు తన ఆధార్‌తోపాటు.. తన తల్లి పాన్‌కార్డు కాపీలు అడిగారని వివరించారు. ‘‘ఇప్పుడు డబ్బులు కట్టకుంటే.. పాన్‌కార్డుపై ఉన్న మా అమ్మ ఫొటోను మార్ఫింగ్‌ చేసి, పోర్న్‌ సైట్లలో పెడతామని బెదిరిస్తున్నారు.


నా కాంటాక్ట్‌ లిస్టులో ఉన్నవారికి నన్ను దొంగ/మోసగాడిగా పేర్కొంటూ సందేశాలు పంపుతున్నారు. నా ఆధార్‌ కార్డుపై ‘రేపిస్ట్‌’ అంటూ మార్ఫింగ్‌ చేసి.. నా కాంటాక్ట్‌ లిస్టులో ఉన్నవారికి షేర్‌ చేస్తున్నారు’’ అంటూ ప్రదీప్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో.. ఆ వేధింపులు భరించలేక.. వారు చెప్పినట్లు రూ. 4 వేలు చెల్లించినా.. ఇంకా బకాయి ఉందంటూ ఫోన్‌ చేస్తున్నారని వాపోయారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నారు.

Updated Date - 2022-05-23T08:49:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising