ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారతీయ విద్యార్థులను త్వరగా తీసుకొస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ABN, First Publish Date - 2022-02-27T02:00:44+05:30

యుద్ధం బారిన పడిన ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులను త్వరగా తీసుకొస్తామని కేంద్రమంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: యుద్ధం బారిన పడిన ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులను త్వరగా తీసుకొస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు సంబంధించిన ఇతర ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడారు. భారతీయ విద్యార్థులను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకు రావడానికి భరోసానివ్వడం జరిగిందన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతదేశానికి చెందిన విద్యార్థులను తిరిగి మన దేశానికి తీసుకురావటానికి భారత ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తోందన్నారు. నిరంతరం సరిహద్దు దేశాల అధికారులతో, భారత రాయబార కార్యాలయాల అధికారులతో సంప్రదింపులు జరుపుతూనే ఉందని ఆయన తెలిపారు. సరిహద్దు దేశాలకు ప్రత్యేక విమానాలను పంపించి ఎటువంటి విమాన ఖర్చులు లేకుండా వారిని క్షేమంగా వారి స్వస్థలాలకు చేరవేయడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. చిట్టచివరి విద్యార్థిని తరలించే వరకూ మోదీ ప్రభుత్వం చేపట్టిన ఈ మిషన్ ఆగదని ఆయన స్పష్టం చేశారు. 


Updated Date - 2022-02-27T02:00:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising