ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్న పనులకు జాప్యం ఎందుకు

ABN, First Publish Date - 2022-12-15T23:57:54+05:30

గ్రామాల్లో పూర్తికాని సర్వీస్‌ రోడ్లు, రెయిలింగ్‌ పనులు పలుచోట్ల వీధిలైట్లు లేక అంధకారం గడువు ముగిసి మూడేళ్లయినా కలగని మోక్షం ఇబ్బంది పడుతున్న స్థానికులు రోడ్డు ప్రమాదాలతో గాలిలో కలుస్తున్న ప్రాణాలు పట్టించుకోని పాలకులు, అధికారులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్టేషన్‌ఘన్‌పూర్‌, డిసెంబరు15 : రహదారి విస్తరణ పనులకు గాను కేంద్రప్రభుత్వం 2015లో రూ.1,920 కోట్లను యాదాద్రి-వరంగల్‌ జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టింది. 2016 జూన్‌ 1న అప్పటి కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ పనులకు శంకుస్థాపన చేశారు. రహదారి విస్తరణ పనులకు రూ.897.03 కోట్లు కేటాయించగా మిగితా 1,022.97 కోట్లు భూసేకరణ, ఇళ్ల యజమానులకు పరిహారం చెల్లించడానికి కేటాయించారు. ఎల్‌అండ్‌టీ సంస్థ పనులు చేబట్టింది. యాదాద్రి జిల్లాలోని వంగపల్లి నుంచి వరంగల్‌ జిల్లా అరెపల్లి వరకు 99.10 కిలోమీటర్ల మార్గాన్ని 30 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు ప్రారంభించారు. 2019 జనవరి 1వ తేదీ వరకు పనులు పూర్తి చేయాలని గడువు ఇచ్చారు. గడువు పూర్తై మూడేళ్లు కావస్తున్నా నేటికి అనేక చోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

చేయాల్సిన పనులు..

రహదారి విస్తరణ పనుల్లో భాగంగా గ్రామాలు ఉన్న చోట ప్రజల సౌకర్యార్థం సర్వీసు రోడ్లు వేయాలి. సర్వీసు రోడ్డు దాటి ప్రజలు నేరుగా జాతీయ రహదారి పైకి రాకుండా మధ్యలో ఇనుపకంచెతో రెయిలింగ్‌ ఏర్పాటు చేయాలి. సర్వీసు రోడ్డుకు, జాతీయ రహదారి (ఎక్స్‌ప్రెస్‌ హైవే) కు మధ్య సర్వీసు రోడ్డు పొడవునా హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు చేయాలి. ప్రతీ గ్రామంలో మినీ బస్టేజీ ఏర్పాటు చేయాలి. సర్వీసు రోడ్డు పక్కన గృహాల్లోకి వర్షం, డ్రైనేజీ నీళ్లు రాకుండా చర్యలు తీసుకోవాలి.

పెండింగ్‌ పనులు..

స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం రాఘవపూర్‌లో రహదారికి రెండు వైపులా సర్వీసు రోడ్డు వేయాల్సి ఉండగా నేటికీ అతీగతీ లేదు. కేవలం కంకర పోసి వదిలేశారు. రోడ్డుకు ఇరువైపులా గ్రామంలో 800 మీటర్ల పొడవునా గృహాలు ఉండడంతో సర్వీసు రోడ్డు లేక ప్రజలు నేరుగా ఎక్స్‌ప్రెస్‌హైవే పైకి వెళ్లడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. గృహాలు ఉన్నచోట విస్తరణ పనులకుగాను 75 ఫీట్ల వెడల్పు తీయగా రాఘవపూర్‌లో మాత్రం 100 ఫీట్లు తీశారు. అయినా సర్వీసు రోడ్డును ఏర్పాటు చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఘన్‌పూర్‌ బస్టాండ్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే దారిలో సీర్వీసు రోడ్డు నిరుపయోగంగా మారింది. బస్టాండ్‌ నుంచి శ్రీవాణి గురుకులం వరకు సర్వీసు రోడ్డు వేయాల్సిఉండగా కేవలం సబ్‌స్టేషన్‌ వరకే వేసి వదిలేశారు. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

చిలుపూరు మండలం చిన్నపెండ్యాలలో సర్వీసు రోడ్లు వేసినప్పటికీ రెండు వైపులా రెయిలింగ్‌ ఏర్పాటు చేయలేదు. దీంతో రోడ్డు దాటుతున్న క్రమంలో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. అంతేగాకుండా సర్వీసు రోడ్డు ప్రక్కన డ్రెయినేజీ పూర్తికాకపోవడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదతో ప్రజలు అవస్థలు పడాల్సి వచ్చింది.

ధర్మసాగర్‌ మండలం కరుణాపురం వద్ద సర్వీసు రోడ్లు, రెయిలింగ్‌ ఏర్పాటు చేసినప్పటికీ హైమాస్ట్‌ లైట్లు లేకపోవడంతో రాత్రివేళ్లల్లో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు రహదారిపై నిలబడి బస్సులు ఎక్కాల్సి వస్తోంది.

గ్రామంలో సర్వీసు రోడ్డు వేయాలి...

- కాసాని మల్లయ్య, రాఘవపూర్‌

రహదారి కోసం మా ఇంటి స్థలాలను బలవంతంగా తీసు కున్నారు. తీరా గ్రామంలో సర్వీ సురోడ్డును ఏర్పాటు చేయకుం డా వదిలేశారు. దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నాం. వెం టనే గ్రామంలో సర్వీస్‌ రోడ్లను ఏర్పాటు చేయాలి.

అధికారులు నిర్లక్ష్యం వీడాలి..

- జూలకుంట్ల శిరీష్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు

అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి. ఘన్‌పూర్‌ పట్టణంలో సర్వీసురోడ్డు పూర్తికాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే సంబంఽధిత అధికారులు స్పందించి గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న రహదారి పనులు పూర్తి చేయాలి.

Updated Date - 2022-12-15T23:58:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising