ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనాథకు ఇల్లు కట్టించి ఇచ్చిన సర్పంచ్‌

ABN, First Publish Date - 2022-12-16T23:37:02+05:30

అనాథ మహిళలకు సొంత ఖర్చులతో ఇల్లు కట్టించి శుక్రవారం దానిని అందజేసి జాతీయ ఆదర్శ గ్రామం మరియపురం స ర్పంచ్‌ అల్లం బాల్‌రెడ్డి తన ఔదార్యాన్ని చాటుకున్నా రు. గ్రామస్థుల కథనం ప్రకారం. గ్రామానికి చెందిన 56 ఏళ్ల జ్యోతికి, ఇదే గ్రామానికి చెందిన గాలి జోజి రెడ్డితో 35ఏళ్ల క్రితం వివాహం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సొంత స్థలంలో రూ.3.25 లక్షలతో నిర్మాణం

గీసుగొండ, డిసెంబరు 16: అనాథ మహిళలకు సొంత ఖర్చులతో ఇల్లు కట్టించి శుక్రవారం దానిని అందజేసి జాతీయ ఆదర్శ గ్రామం మరియపురం స ర్పంచ్‌ అల్లం బాల్‌రెడ్డి తన ఔదార్యాన్ని చాటుకున్నా రు. గ్రామస్థుల కథనం ప్రకారం. గ్రామానికి చెందిన 56 ఏళ్ల జ్యోతికి, ఇదే గ్రామానికి చెందిన గాలి జోజి రెడ్డితో 35ఏళ్ల క్రితం వివాహం జరిగింది.

కలిసి కూలీ నాలి చేసుకుని దంపతులు జీవించేవారు. వీరికి సం తానం లేదు. గ్రామంలో చిన్న అద్దె ఇంట్లో ఉండేవా రు. రెండు నెలల క్రితం జ్యోతి భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. అ సమయంలో మృతదేహాన్ని సంద ర్శించిన బాల్‌రెడ్డి చలించిపోయారు. గూడులేని ఆమె కు ఇల్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గ్రామంలోని తన సొంత జాగ సు మారు 150 గజాలు కేటాయించారు. అందులో పెద్ద హాలు, రెండు రూముల సమానంగా ఇంటి ముందు రేకులు వేసి ఇచ్చాడు. అన్ని సౌకర్యాలు కల్పించారు. ఇందుకోసం సుమారు రూ.3.25లక్షలు ఖర్చు చేశారు. అలాగే ఇంటి స్థలం విలువ మరో లక్షన్నరకు పైనే ఉంటుంది. బాల్‌రెడ్డి తన భార్య నిర్మల(నిర్మల్‌ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌)పేరుతోపాటు అనాథ జ్యోతి పేరు కలిసే లా నిర్మలజ్యోతి అని ఇంటికి నామకరణం చేశారు. ఈ మేరకు శుక్రవారం జ్యోతిని ఘనంగా సన్మానించి, ఇంటిని ఆమెకు అప్పగించారు. అనాథకు అండగా నిలిచిన బాల్‌రెడ్డిని పలువురు ప్రశంసించారు.

Updated Date - 2022-12-16T23:37:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising