ప్రియుడు మోసం చేశాడని..
ABN, First Publish Date - 2022-12-16T00:21:10+05:30
ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియుడు ముఖం చాటేశాడని ఓ యువతి గు రువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రియుడి కోసం నాలుగు రోజుల నుంచి నిరసనకు దిగినప్పటికీ న్యాయం జరగకపోవడంతో చివరికి ప్రాణాలకు తెగిం చింది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాధితురాలి కు టుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కొన్నిరోజులుగా ప్రియుడి ఇంటి వద్ద నిరసన
స్పందించకపోవడంతో హెయిర్‌డై తాగిన వైనం
ధర్మసాగర్, డిసెంబరు 15: ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియుడు ముఖం చాటేశాడని ఓ యువతి గు రువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రియుడి కోసం నాలుగు రోజుల నుంచి నిరసనకు దిగినప్పటికీ న్యాయం జరగకపోవడంతో చివరికి ప్రాణాలకు తెగిం చింది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాధితురాలి కు టుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ధర్మసాగర్ మండలం ఎలుకుర్తి గ్రామానికి చెందిన ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన మాదాసి దివ్య.. వేలేరు మండలం పీచర గ్రామానికి బీసీ (ముదిరాజ్) సామాజికవర్గానికి చెందిన మాచర్ల నితిన్ ధర్మసాగర్ జూనియర్ కళాశాలలో ఆరేళ్ల కిందట చదువుకున్నారు. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. కానీ ఇద్దరి కులాలు వేరుకావడంతో కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో ఏడు మాసాల కిందట కాళేశ్వరం లో దివ్య, నితిన్‌లు ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇ ద్దరి కుటుంబసభ్యులకు తెలియకుండా వరంగల్ రామన్నపేటలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టా రు. కొద్ది రోజుల తర్వాత దివ్య గర్భం దాల్చింది. విష యం ఇద్దరి కుటుంబసభ్యులకు తెలియడంతో ఖంగుతిన్నారు. వీరి వివాహాన్ని నితిన్ కుటుంబ సభ్యులు నిరాకరించారు. నితిన్‌ను వెంట తీసుకెళ్లారు. ఈ క్రమంలో దివ్య ఎంత ఫోన్ చేసినా నితిన్ స్పందించలేదు. దీంతో దివ్య గత నవంబరు 2న ధర్మసాగర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో స్థానిక పెద్దమనుషులు కలుగజేసుకుని కేసు వాపస్ తీసుకోవాలని బలవంతం చేశారు. అబ్వాయి నుంచి డబ్బులు ఇప్పిస్తామని చెప్పారు. దీంతో తనకు న్యాయం కావాలని, డబ్బులు వద్దని దివ్య చెప్పింది. చివరికి దివ్య, నితిన్ కలిసి ఉండాలని పెద్ద మనుషులు తీర్మానం చేశారు.
అయినప్పటికీ దివ్యతో నితిన్ మాట్లాడకపోవడం, క లిసి ఉండకపోవడంతో నాలుగు రోజుల నుంచి పీచర గ్రామంలో నితిన్ ఇంటి ఎదుట నిరసనకు దిగింది. ఈ క్రమంలో న్యాయం జరుగుతుందో, లేదో అన్న అనుమానంతో మనస్థాపం చెందిన దివ్య.. గురువారం హెయిర్‌డై తాగి నేరుగా ధర్మసాగర్ పోలీసుస్టేషన్ ముందు కు వచ్చింది. అక్కడి వారు గమనించి పోలీసులకు స మాచారం అందించడంతో దివ్యను చికిత్స కోసం ఎంజీ ఎం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై సీఐ రమే ష్ వివరణ కోరగా యువతి ఆత్మహత్యాయత్నానికి పా ల్పడినట్టు తెలిసింది. కానీ, తమకు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని తెలిపారు.
Updated Date - 2022-12-16T00:21:12+05:30 IST