గొత్తికోయలకు రక్షణ కల్పించాలి
ABN, First Publish Date - 2022-12-07T00:05:21+05:30
: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడు గొత్తికోయలకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలని సామాజిక న్యాయవేదిక జిల్లా వర్కింగ్ ప్రెసి డెంట్ పూనెం శోభన్ డిమాండ్ చేశారు.
గోవిందరావుపేట, డిసెంబరు 6: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడు గొత్తికోయలకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలని సామాజిక న్యాయవేదిక జిల్లా వర్కింగ్ ప్రెసి డెంట్ పూనెం శోభన్ డిమాండ్ చేశారు. మండలంలోని ఇప్పలగడ్డలో మంగళవారం ఆదివాసీలతో జరిగిన సమా వేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల గొత్తికోయలచేతిలో ఫారెస్టు అధికారి శ్రీనివాసరావు హత్యకు గురికావడం బాధాకరమని, ఆయన మృతికి కారకులైన వారిని శిక్షించ డం న్యాయమేనని పేర్కొన్నారు. అయితే బెండాలపాడు గొత్తికోయలందరిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఫారెస్టు అధికారులు గ్రామసభ ద్వారా బహిష్కరణ ప్రకటన చేయడం దురదృష్టకరమని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు ధనసరి కిరణ్, తాటి ప్రశాంత్, ధనసరి బల రాం, నాగయ్య, రామ్మూర్తి, డి.రామయ్య, రంజిత్, పెనుక జోగయ్య, డి.పుల్లయ్య, రాజేష్, సాంబయ్య, లక్ష్మయ్య, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T00:05:22+05:30 IST