జిల్లాకు త్వరలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్
ABN, First Publish Date - 2022-11-15T23:44:56+05:30
జిల్లాకేంద్రంలో త్వరలోనే ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంను మంగళవారం ఆయన ప్రారంభించారు.
పీఎ్‌సలలో సిబ్బంది కొరత తీరుస్తాం
వరంగల్ సీపీ తరుణ్ జోషి
ఆర్టీసీ చౌరస్తాలో కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం
జనగామ టౌన్, నవంబరు 15: జిల్లాకేంద్రంలో త్వరలోనే ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంను మంగళవారం ఆయన ప్రారంభించారు. కంట్రోల్ రూంలో సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ మంజూరైందని, త్వరలో నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వంతో చర్చించామని తెలిపారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతున్నాయని చెప్పారు. వీటి సాయంతో స్నాచింగ్ కేసులు తగ్గాయన్నారు. జనగామ పట్టణంలో 150 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రధాన కూడళ్లన్నింటిలో నిఘా పెట్టామన్నారు. మరో 150 కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. కొత్తగా పోలీస్ శాఖలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ జరుగుతోందని, కొత్త కానిస్టేబుళ్లు రాగానే పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరత తీరుస్తామని అన్నారు. గతంలో తొలగించిన ట్రాఫిక్ సిగ్నల్స్‌ను మళ్లీ త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ సీతారాం, ఏసీపీలు దేవేందర్‌రెడ్డి, రఘుచందర్, సీఐలు శ్రీనివా్‌సయాదవ్, రాఘవేంర్, సంతోష్, ఎస్సైలు రఘుపతి, శ్రీనివాస్, జీనత్‌కుమార్, రుక్మాచారి తదితరులు పాల్గొన్నారు.
రౌడీషీటర్ల కదలికలపై నిఘా..
రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని సీపీ తరుణ్‌జోషి పోలీసు అధికారులకు సూచించారు. కంట్రోల్ రూం ప్రారంభోత్సవం అనంతరం ఆయన జనగామ పోలీస్ స్టేషన్‌లో క్రైం రివ్యూ నిర్వహించారు. రౌడీషీట్ నమోదైన వారు ప్రస్తుతం ఎక్కడ నివాసముంటున్నారు.. ఏం చేస్తున్నారనే విషయాలపై ఆరా తీశారు. నిత్యం పెట్రోలింగ్ నిర్వహిస్తూ ప్రజల్లో పోలీసులపై నమ్మకం కలిగించాలన్నారు.
Updated Date - 2022-11-15T23:45:00+05:30 IST