ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేడారం మినీ జాతరకు సన్నద్ధం

ABN, First Publish Date - 2022-12-15T23:51:14+05:30

రూ.2 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించిన అధికారులు రోడ్లు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాల పునరుద్ధరణ అందుబాటులోకి రానున్న వసతి షెడ్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు, డిసెంబరు 15: మేడారం మినీ జాతరకు సమయం దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు జరిగే ఈ వేడుక కోసం అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. భక్తులకు మెరుగైన వసతులు కల్పించేం దుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మహాజాతరల సందర్భంగా శాశ్వత ప్రాతిపదికన కల్పించిన వసతులను వినియోగంలోకి తెచ్చేలా చర్యలు చేపడుతున్నారు. పారిశుధ్యం, తాగునీరు, భద్రతా అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.

మండమెలిగే పండగే మినీ జాతర..

తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి సమ్మక్క-సారలమ్మ జాతర జరుగుతుంది. జాతర ముగిసిన తర్వాత ఏడాదికి ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం మండమెలిగే పండగ నిర్వహించడం ఆనవాయితీ. వనదేవతల వడ్డెలు(పూజారులు), కుటుంబ సభ్యులు దేవతల గద్దెలు, పూజా మందిరా లు, పూజా సామగ్రిని శుద్ధి చేసి అలుకుపూతలతో దేవతలను కొలుచుకుంటారు. నాలుగు రోజులపాటు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సమయంలో సమ్మక్క, సారలమ్మల గద్దెలను దర్శించుకు నేందుకు రాష్ట్రంతోపాటు ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మహారాష్ట్రల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈసారి మినీ జాతరకు మహాజాతర తరహాలో సుమారు 30 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు.

పారిశుధ్యం, తాగునీటికి ప్రాధాన్యం

మినీ జాతర నిర్వహణ కోసం ఇప్పటికే జిల్లా అధికారులతో సమీక్ష జరిపిన కలెక్టర్‌ ఎస్‌.కృష్ణ ఆదిత్య సూచనలు చేశారు. భక్తులకు వసతుల కల్పన కోసం ప్రతిపాదనలు అడిగారు. సుమారు రూ.2 కోట్లతో ఆయా శాఖల విభాగాధిపతులు సమర్పించిన ప్రతిపా దనలు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నా యి. రక్షిత మంచినీటి సరఫరా, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారించా రు. మహాజాతర సమయంలో వేసిన అండర్‌గ్రౌండ్‌ పైప్‌లైన్‌, ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లకు మరమ్మతులు చేయనున్నారు. మేడారం చుట్టుపక్కల ఐదు విడిది షెడ్లను నిర్మించగా వాటిలో సౌకర్యాలను మెరుగుపర్చి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేనున్నారు. ప్రతి షెడ్డులోనూ 20చొప్పున మరుగుదొడ్లు ఉండగా జంపన్నవాగు, ఎండోమెంట్‌ కాటేజీల వద్ద నిర్మించిన సులభ్‌కాంప్లెక్స్‌లను అందుబాటులోకి తేనున్నారు. మేడారం, జంపన్నవాగు, ఊరట్టం, కన్నెపల్లి, రెడ్డిగూడెం, కొత్తూరు పరిసరాల్లోనే భక్తులు విడిది చేసే అవకాశాలు ఉండగా పారిశుధ్య పనుల కోసం 500 మంది కార్మికులను నియమించనున్నారు. ఏర్పాట్లను ఏటూరునాగారం ఐటీడీఏ పర్యవేక్షించనుంది.

ప్రధాన శాఖలకు ఆదేశాలు..

మినీ జాతర నిర్వహణలో రెవెన్యూ, డీపీవో, పోలీసు, ట్రాన్స్‌కో, దేవాదాయ, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖల పాత్ర కీలకంగా ఉన్నాయి. రెవెన్యూ శాఖ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించనుండగా డీపీవో పారిశుధ్యం, పోలీసు శాఖ శాంతిభద్రతలు, ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్‌ సరఫరా, ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతులు, ఆర్‌డబ్ల్యూఎస్‌ నీటిసరఫరా, మరుగుదొడ్ల నిర్వహణ, దేవాదాయ శాఖ భక్తుల దర్శనాలకు ఏర్పాట్లు చేస్తాయి. ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్‌ జాతరకు వారం రోజుల ఏర్పాట్లు పూర్తిచేసేలా ఆదేశాలు జారీ చేశారు.

రోడ్లకు మరమ్మతులు

మహాజాతర తర్వాత మేడారం-పస్రా, మేడారం-తాడ్వాయి మధ్య ప్రధాన రహదారి దెబ్బతింది. ఇసుక లారీలు, వరదల కారణంగా గుంతలుపడ్డాయి. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో వీటిని మరమ్మతు చేసేందుకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. మేడారం, రెడ్డిగూడెం, కన్నెపల్లి వద్ద జంపన్నవాగు వరదలకు కొంతమేర రోడ్లు ధ్వంసం కాగా వాటికి కూడా మరమ్మతు చేయనున్నారు.

మినీ జాతరకు సిద్ధమవుతున్నాం..

- ఎస్‌.కృష్ణ ఆదిత్య, ములుగు కలెక్టర్‌

మేడారం మినీ జాతరకు ఘనంగా జరిపించేందుకు సన్నద్ధమవుతున్నాం. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తాం. శాశ్వత ప్రాతిపదికన గతంలో చేసిన నిర్మాణాలను అందుబాటులోకి తెస్తాం. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నాం. 2024 మహాజాతర సందర్భంగా భక్తులకు కల్పించే సౌకర్యాలపై కూడా యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేస్తున్నాం.

Updated Date - 2022-12-15T23:51:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising