ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్సాహంగా జాతీయ కరాటే పోటీలు

ABN, First Publish Date - 2022-10-23T23:55:17+05:30

హనుమకొండ జక్రీయా ఫంక్షన్‌హాలులో దమ్మికా కాయ్‌ చిటోరియో ఆధ్వర్యంలో రెండో జాతీయస్థాయి కరాటే పోటీలు ఆదివారం కోలాహలంగా ప్రారంభం అయ్యాయి. ఒక్కరోజు జరిగే ఈ క్రీడా పోటీలను మాతా గార్డెన్స్‌ నిర్వాహకులు, ప్రొఫెసర్‌ మాందాటి మనోజ్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

పోటీలను ప్రారంభిస్తున్న నిర్వాహకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐదు రాష్ట్రాల నుంచి 500 మంది క్రీడాకారుల హాజరు

హనుమకొండ స్పోర్స్ట్‌ అక్టోబరు 23: హనుమకొండ జక్రీయా ఫంక్షన్‌హాలులో దమ్మికా కాయ్‌ చిటోరియో ఆధ్వర్యంలో రెండో జాతీయస్థాయి కరాటే పోటీలు ఆదివారం కోలాహలంగా ప్రారంభం అయ్యాయి. ఒక్కరోజు జరిగే ఈ క్రీడా పోటీలను మాతా గార్డెన్స్‌ నిర్వాహకులు, ప్రొఫెసర్‌ మాందాటి మనోజ్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరాటే ఆత్మరక్షణకు దోహదపడుతుందన్నారు. కరాటేలో రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని తెలిపారు. దమ్మికా కాయ్‌ చిటోరియో అధ్యక్షుడు బండారి సంతోష్‌ మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో ఓపెన్‌ టూ ఆల్‌ కేటగిరీలో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇండివిజువల్‌ కటాస్‌, టీం కటాస్‌, కుమ్‌కీ కటాస్‌లో క్రీడాకారులు నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడి తమ ప్రతిభను చాటుకున్నారు.

ఇందులో పాల్గొన్న క్రీడాకారులు భోజన సదుపాయాలు తమ అసోసియేషన్‌ ద్వారా కల్పించినట్లు సంతోష్‌ తెలిపారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు త్వరలో హైదరాబాదులో జరగనున్న అంతర్జాతీయస్థాయి కరాటే పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాయ్‌ జనరల్‌ సెక్రటరీ శ్రీనివాస్‌, అధ్యక్షుడు వెంకటేశ్‌, కోశాధికారి నరేందర్‌, ఉపాధ్యక్షుడు ప్రసన్న, సంయుక్త కార్యదర్శి వెంకటేష్‌, గ్రాండ్‌ మాస్టర్‌ వీరాచారి, మాస్టర్స్‌ విశ్వనాథ్‌, భరత్‌, రచ్చ శ్రీనివాస్‌, శ్రీరాములు, చీకటి సుప్రియ, దినేష్‌, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-23T23:55:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising