రేపు అనఘాష్టమి వ్రతాలు
ABN, First Publish Date - 2022-12-15T00:26:47+05:30
వరంగల్ నగరంలో జగద్గురు గణపతి సచ్చిదానంద స్వామీజీ సత్య సంకల్పంతో అవధూత దత్త పీఠం ఉత్తరాధికారి దత్త విజయానంద తీర్థ స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్‌లో 16న శుక్రవారం 10వేల దంపతులతో సామూహికంగా అయి తా అనఘాష్టమి వ్రతాలు జరుగనున్నాయి.
ఆర్ట్స్ కళాశాలలో నిర్వహణ
ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
హనుమకొండ కల్చరల్, డిసెంబరు 14: వరంగల్ నగరంలో జగద్గురు గణపతి సచ్చిదానంద స్వామీజీ సత్య సంకల్పంతో అవధూత దత్త పీఠం ఉత్తరాధికారి దత్త విజయానంద తీర్థ స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్‌లో 16న శుక్రవారం 10వేల దంపతులతో సామూహికంగా అయి తా అనఘాష్టమి వ్రతాలు జరుగనున్నాయి. ఉదయం ఉదయం 9గంటలకు వ్రతం, సాయంత్రం 5గంటలకు 5వేల దంపతులతో సామూహిక శ్రీభగవద్గీత పారాయణం జ రుగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జి ల్లా నలుమూలల నుంచే కాకుండా దేశంలోని అన్ని దత్తపీఠాల నుంచి ప్రతినిఽధులు పెద్ద సం ఖ్యలో పాల్గొననున్నారు. పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
గణపతి సచ్చిదానంద పర్యవేక్షణలో నిర్వహించే ఈ వ్రతానికి వారం రోజుల నుంచి దత్త క్షేత్రం నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దత్తపీఠం నుంచి తరలివచ్చిన కల్యాణ్‌శర్మ, దిలీ్‌పశర్మ, చక్రవర్తి శర్మల సూచనల వేరకు స్థానిక ట్రస్టీలు వై.వి.వామన్‌రావు, బెండెల అర్జున్‌రావు, మండువ శేషగిరిరావు, ప్రొఫెసర్ వడ్డె రవీందర్‌రావు, ప్రొఫెసర్ కృష్ణప్రసాద్, తదితర ట్రస్టీలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 30వేల మందికి 30కౌంటర్ల ద్వారా అన్నదానంతోపాటు యాగానికి తరలి వచ్చే జంటలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 9గంటలకు వ్రతం, సాయంత్రం 5గంటలకు 5వేల దంపతులతో సామూహిక శ్రీభగవద్గీత పారాయణం జరుగనుంది. ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఈ విశేష ఆధ్యాత్మిక కార్యక్రమానికి కీలక పాత్ర నిర్వహిస్తున్నారు.
అధికారుల సమీక్ష
హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్‌లో కార్యక్రమ నిర్వహణపై బుధవారం పలువురు అధికారులు గ్రౌండ్‌ను సందర్శించారు. పోలీస్ కమిషనర్ రంగనాథ్, హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, వరంగల్ జిల్లా కలెక్టర్ బి.గోపీ, అడిషనల్ కలెక్టర్లతో పాటు ఇతర అధికారులకు ఆహ్వాన పత్రికలు అందచేశారు. బుధవారం రాత్రి వరంగల్‌కు శ్రీదత్త విజయానంద తీర్థ స్వామీజీ చేరుకున్నారు. గురువారం సాయంత్రం జగద్గురువులు గణపతి సచ్చిదానంద స్వామీజీ చేరుకుంటారు. సాయంత్రం స్వాగత సభ ఉంటుందని దత్త క్షేత్రం ట్రస్టీ వై.వి.వామన్‌రావు తెలిపారు.
Updated Date - 2022-12-15T00:26:48+05:30 IST