ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Warangal జిల్లా మొగిలిచర్లలో తీవ్ర ఉద్రిక్తత..

ABN, First Publish Date - 2022-06-15T20:57:44+05:30

Warangal జిల్లా: మొగిలిచర్ల (Mogilicharla)లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Warangal జిల్లా: మొగిలిచర్ల (Mogilicharla)లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతుల (Farmers) భూముల నుంచి విద్యుత్ హైటెన్షన్ లైన్ల నిర్మాణానికి అధికారులు ప్రయత్నించారు. దీన్ని అడ్డుకోడానికి రైతులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. రైతుల భూముల నుంచి విద్యుత్ హైటెన్షన్ లైన్లు వేయడానికి కొంత కాలంగా అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనిని రైతులు అడ్డుకుంటున్నారు.


నిన్న గ్రామానికి వచ్చిన అధికారులను రైతులు అడ్డుకోవడంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. మళ్లీ బుధవారం ఉదయం పోలీసుల సహాయంతో గ్రామానికి వచ్చారు. తమ భూముల్లో విద్యుత్ హైటెన్షన్ వైర్లు వేయడానికి ఒప్పుకునేది లేదని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ భూముల్లోకి ఎలా ప్రవేశిస్తారని పోలీసులతో వాదనకు దిగారు. వ్యవసాయమే ఆధారంగా బతికే తమ భూముల్లో హైటెన్షన్ వైర్లు వేయడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. ఆ విషయం తమ వరకు రాలేదని, పోలీసులతో కుమ్మక్కయి తమ భూముల్లో అక్రమంగా విద్యుత్ వైర్ల నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Updated Date - 2022-06-15T20:57:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising