ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలాజీ నగర్‌ జంక్షన్‌ విస్తరణపై నిర్లక్ష్యం

ABN, First Publish Date - 2022-01-28T05:32:21+05:30

బాలాజీ నగర్‌ జంక్షన్‌ విస్తరణపై నిర్లక్ష్యం

విస్తరణకు నోచుకోని వరంగల్‌ ఏనుమాముల సమీపంలోని బాలాజీనగర్‌ జంక్షన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.80లక్షలతో విస్తరణ పనులు 

ఏడాదిన్నర పాటు కొనసాగి నిలిచిపోయిన వైనం..

చిన్నపాటి వర్షానికే మోకాళ్ల లోతు నీళ్లు, బురద  

రహదారి మధ్యలోనే విద్యుత్‌ స్తంభాలు 


వరంగల్‌ టౌన్‌, జనవరి 27: ఎన్నికల ముందు చకచకా పనులు సాగాయి.. అనంతరం నత్తనడకన సాగి.. ఇప్పుడు పూర్తిగా నిలిచిపోయాయి.. చినుకు పడిందంటే చాలు ఆ ప్రాంతమంతా బురద, వరద  నీటితో నరకాన్ని తలపిస్తుంది. అయినా పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నరగా ఏనుమా ముల బాలాజీనగర్‌ జంక్షన్‌ విస్తరణ పనుల జాప్యం పై వారు మండిపడుతున్నారు.

నగరంలోని 14వ డివిజన్‌ ఏనుమాముల బాలాజీ నగర్‌లో సుమారు రూ.78 లక్షలతో చేపట్టిన జంక్షన్‌ విస్తరణ పనులు ఏడాదిన్నరగా నత్తనడకన సాగుతు న్నాయి. పాలకులు, అధికారులు పట్టించుకోకపోవ డంతో పనులు ముందుకు సాగడం లేదు. గ్రేటర్‌ ఎన్నికలకు ముందు యమ స్పీడ్‌గా సాగిన పనులు ఎన్నికల తర్వాత నత్తనడకన సాగి, ప్రస్తుతం పను లు మొత్తానికే నిలిచిపోయాయి. దీంతో చిన్న పాటి వర్షానికే జంక్షన్‌లో మోకాల్లోతు నీళ్లు నిలిచి వాహ నాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మొత్తం బురదమయం కావడంతో అధికారుల, ప్రజా ప్రతినిధుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. 


తొలగించని విద్యుత్‌స్తంభాలు

జంక్షన్‌లో ఎటు చూసినా విద్యుత్‌ స్తంభాలే కని పిస్తున్నాయి. విస్తరణ పనులు జరుగుతున్నా ఇంకా వాటిని తొలగించడం లేదు. దీంతో మార్కెట్‌వకు వచ్చే భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. 


కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్తా.. 

 - తూర్పాటి సులోచన సారయ్య,  14వ డివిజన్‌ కార్పొరేటర్‌  

అభివృద్ధి పనులు చురుకుగా సాగేందుకు కృషి చేస్తున్నాం. జంక్షన్‌లో ఉన్న కరెంట్‌ పోల్స్‌ తొలగించేందుకు పలుమార్లు మున్సిపల్‌ డీఈ లక్ష్మా రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. మునిసిపల్‌ సిబ్బందితోనే పోల్స్‌ తొలిగిస్తామని పేర్కొన్నారు. అయినా తొలగించ లేదు. గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లి తొలగించేలా చర్యలు తీసుకుంటాం. 





Updated Date - 2022-01-28T05:32:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising