ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SI doing CPR : శెభాష్ ఎస్ఐ.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి స్వయంగా సీపీఆర్.. వీడియో వైరల్..

ABN, First Publish Date - 2022-07-28T00:11:13+05:30

మనలో చాలా మందికి పోలీసులు అంటే భయం ఉంటుంది. ఎందుకంటే సామాన్య జనంతో వారు ప్రవర్తించే తీరు చూసి వాళ్లపై ఇలాంటి అభిప్రాయానికి వచ్చారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్: మనలో చాలా మందికి పోలీసులు అంటే భయం ఉంటుంది. ఎందుకంటే సామాన్య జనంతో వారు ప్రవర్తించే తీరు చూసి వాళ్లపై ఇలాంటి అభిప్రాయానికి వచ్చారు ప్రజలు.  నిజానికి ప్రతి ఖాకీ గుండె అంత కటువుగా ఉండదు. సమయస్పూర్తితో వ్యవహరిస్తూ కొన్ని సందర్భాల్లో నిండు ప్రాణాలను కూడా కాపాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రజల ప్రాణాలను కాపాడటానికి తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టిన అనేక మంది పోలీసులున్నారు. ఇలాగే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ వ్యక్తికి ఓ ఎస్‌ఐ, సీపీఆర్ అదించి ప్రాణాప్రాయం నుంచి కాపాడారు. ఆ ఎస్‌ఐ ఇప్పుడు అందరి మన్ననలను అందుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహథ్నూర్ మండలంలోని థోశం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి ఇంద్రవెళ్లి ఎస్‌ఐ(SI) సునీల్ స్వయంగా సీపీఆర్(CPR) అందించారు. బాధితుడిని బతికించే ప్రయత్నంలో భాగంగా స్వయంగా శ్వాస అందించారు. ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని దంతాలపల్లి గ్రామానికి చెందిన ఫరూక్‌గా గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం అతడిని రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన ఓ వ్యక్తి వీడియోను ట్విటర్‌లో షేర్ చేశాడు. దీంతో వీడియో వైరల్‌గా మారింది. స్వయంగా ఎస్‌ఐ సీపీఆర్ అందించిన ఎస్‌ఐని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. సమయస్పూర్తితో వ్యవహరించిన సునీల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. శెభాష్ ఎస్‌ఐ అని కొనియాడుతున్నారు. ట్విటర్‌లో తమ అభినందనలు తెలియజేస్తున్నారు.



Updated Date - 2022-07-28T00:11:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising