ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: ఇకపై రేవంత్‌రెడ్డి ముఖం చూడను: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-08-05T18:51:52+05:30

కాంగ్రెస్‌లో చెరుకు సుధాకర్ చేరికపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: కాంగ్రెస్‌లో చెరుకు సుధాకర్ (Sudhakar) చేరికపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Venkat reddy) మండిపడ్డారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth reddy) పెద్దతప్పు చేశారని విమర్శించారు. తనను ఓడించాలనుకున్న వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. ఇకపై రేవంత్‌రెడ్డి ముఖం చూడనని అన్నారు. పార్లమెంట్ సమావేశాల తర్వాతే మునుగోడుకు వెళ్తానని వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.


కాగా మీడియా ప్రశ్నలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అలాగే వెంకట్రెడ్డి తీరుపై కూడా మీడియా ప్రతినిధులు మండిపడ్డారు. పనికిరాని మునుగోడు గురించి అడుగుతున్నారని బాధగా ఉందని వెంకట్రెడ్డి అన్నారు. వరద సాయం గురించి ఇప్పటివరకు ఎవరూ ప్రస్తావించలేదన్నారు. ప్రధాని, హోంమంత్రి అపాయింట్మెంట్ కూడా కోరానన్నారు. గుజరాత్ తర్వాత.. తెలంగాణాయే ధనిక రాష్ట్రమని సీఎం కేసీఆర్ చెప్పారని, ఇప్పుడు పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి పడిపోయిందని విమర్శించారు. రాష్ట్రం ఇలా ఉన్నప్పుడు.. సీఎం కేసీఆర్ వరద బాధితులకు ఇంకేం సాయం చేస్తారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గురించి తాను మాట్లాడనని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2022-08-05T18:51:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising