భక్తులతో కిటకిటలాడిన వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం
ABN, First Publish Date - 2022-06-28T12:04:42+05:30
వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. ఆపదమొక్కులవాడు రాజరాజేశ్వరస్వామివారిని
రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. ఆపదమొక్కులవాడు రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివచ్చారు. తమ ఇష్టదైవమైన స్వామివారిని దర్శించుకొని తరించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును చెల్లించుకున్నారు. సోమవారం సందర్భంగా గర్భాలయ ప్రవేశం నిలిపివేసి లఘుదర్శనం అమలు చేశారు. భక్తులను నందీశ్వరుడి విగ్రహం వద్ద వరకే అనుమతించారు. ఆలయ కళాభవన్‌లో స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం తదితర ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొన్నారు. ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. ఆలయ ఆవరణలో స్వామివారికి నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించారు. ఆషాఢమాసం ప్రారంభానికి ముందు చివరి సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో ఎల్.రమాదేవి నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు చేశారు
Updated Date - 2022-06-28T12:04:42+05:30 IST