ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vemulawadaలో ఆషాఢం ఎఫెక్ట్‌

ABN, First Publish Date - 2022-07-09T00:17:32+05:30

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడపై ఆషాఢ మాసం ఎఫెక్ట్‌ పడింది. ఆషాఢమాసం ప్రారంభంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడపై ఆషాఢ మాసం ఎఫెక్ట్‌ పడింది. ఆషాఢమాసం ప్రారంభంతో గత నెల 30వ తేదీ నుంచి రాజరాజేశ్వరస్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఆషాఢమాసంలో తీర్థయాత్రలు, దైవ దర్శనాలకు వెళ్లడాన్ని చాలా మంది ఇష్టపడరు. ఫలితంగా  పది రోజులుగా వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో క్యూలైన్లు దాదాపు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా మొక్కులు ఉన్నవారు మాత్రమే  స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు. కొవిడ్‌ ఎఫెక్ట్‌ తగ్గిత తరువాత మహాశివరాత్రి పర్వదినానికి ముందు నుంచి రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం నిత్యం వేలాది మంది యాత్రికులతో సందడిగా మారింది. అప్పటి నుంచి వరుసగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆషాఢం మాసం ప్రారంభంతో భక్తుల రాక తగ్గిపోయింది. భక్తుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో రద్దీ నియంత్రణకు, భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడానికి కష్టపడి పనిచేసిన ఆలయ ఉద్యోగులు ఆషాఢం ఎఫెక్ట్‌తో కొంత మేరకు సేదతీరుతున్నారు. కాగా, శ్రావణమాసంలో మళ్లీ భక్తుల సంఖ్య భారీగా పెరుగనుంది. శ్రావణమాసంలో అన్నీ మంచి రోజులు కావడం, పండుగలు, శుభకార్యాలు, ఆలయ ఉత్సవాలు, ప్రత్యేక పూజల కారణంగా తిరిగి భక్తుల రద్దీ పెరుగనుంది.

Updated Date - 2022-07-09T00:17:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising